IPL 2021 venue shifted to UAE: ఐపిఎల్ 2021 టోర్నమెంట్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మిగతా సీజన్ మ్యాచులను గతేడాదిలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (IPL 2021 UAE schedule) నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా అదే నిజం చేస్తూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించినట్టు ఏఎన్ఐ పేర్కొంది. ఐపీఎల్ 2021 మిగతా మ్యాచులను యూఏఈలో నిర్వహించనున్నట్టు ఏఎన్ఐ ఈ ట్వీట్‌లో పేర్కొంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్చువల్‌గా జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో బీసీసీఐ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు బీసీసీఐ వెల్లడించింది. వివో ఐపిఎల్ 2021 (VIVO IPL 2021 remaining matches) సీజన్ మిగతా మ్యాచులు ఇదే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జరగనున్నాయి. 

ఐపిఎల్ 2021లో (IPL 2021) పాల్గొంటున్న ఆటగాళ్లతో పాటు కొంత మంది సపోర్టింగ్ స్టాఫ్‌కి కరోనా వైరస్ (COVID-19) సోకిన నేపథ్యంలో మే మొదటి వారంలో ఐపిఎల్ టోర్నమెంట్‌ని నిలిపేస్తున్నట్టు బీసీసీఐ (BCCI about IPL 2021) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.