List of Hat-Tricks in IPL history: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే రసవత్తర మ్యాచ్‌లకు పెట్టింది పేరు. మెగా టోర్నీలో ఎప్పుడు ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పలేము. గెలుస్తుందనే జట్టు ఓడిపోవచ్చు, ఒడితుందనే టీమ్ గెలవచ్చు. అలానే ధాటిగా ఆడే బ్యాటర్ ఊహించని విధంగా ఔట్ అవొచ్చు.. ధారాళంగా పరుగులు ఇచ్చే బౌలర్‌ అనూహ్యంగా వికెట్లు పడగొట్టొచ్చు. దీంతో క్షణాల్లో మ్యాచ్‌ల ఫలితమే మారుతుంది. అలా ఐపీఎల్‌లో చెలరేగి ఫలితాలను తలకిందులు చేసిన హ్యాట్రిక్‌ వీరులు చాలామందే ఉన్నారు. రెండు రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ 'హ్యాట్రిక్' హీరోలు ఎవరో ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 సీజన్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు అన్ని సీజన్లలో కలిపి బౌలర్లు మొత్తం 20 హ్యాట్రిక్‌లు సాధించారు. అందులో 11 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కొందరు ఆటగాళ్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు హ్యాట్రిక్‌లు సాధించిన వారు కూడా ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధిక హ్యాట్రిక్‌లు పడగొట్టిన బౌలర్‌గా భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఢిల్లీకి చెందిన ఈ లెగ్ స్పిన్నర్ ఐపీఎల్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. 


2008లో ఢిల్లీ తరపున బరిలోకి దిగిన అమిత్ మిశ్రా.. అప్పటి డెక్కన్ ఛార్జర్స్‌పై మొదటి హ్యాట్రిక్ సాధించాడు. రవీంద్ర జడేజా, ప్రగ్యాన్ ఓజా, ఆర్‌పీ సింగ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. 2011 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడుతూ.. పంజాబ్ కింగ్స్‌కు చెందిన ర్యాన్ మెక్‌లారెన్, మన్ దీప్ సింగ్, ర్యాన్ హారిస్‌లను ఔట్ చేసి రెండో హ్యాట్రిక్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన మిశ్రా.. పూణే వారియర్స్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్, రాహుల్ శర్మ, అశోక్ దిండాను ఔట్ చేసి మూడవ హ్యాట్రిక్ సాధించాడు.


ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లోనే రెండు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక బౌలర్‌గా కూడా యువీనే. 2009లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన యువీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్స్ జాక్ కాలిస్, రాబిన్ ఉతప్ప, మార్క్ బౌచర్‌లను ఔట్ చేసి తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. అదే 2009లో హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ ఆటగాళ్లు హర్షల్ గిబ్స్, ఆండ్రూ సైమండ్స్, వేణుగోపాల్ రావులను పెవిలియన్ చేర్చి రెండోసారి హ్యాట్రిక్‌ ఖాతాలో వేసుకున్నాడు. 


లక్ష్మిపతి బాలాజీ, అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండీలా, ప్రవీణ్ తాంబే, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, శ్రేయస్ గోపాల్, హర్షల్ పటేల్ భారత్ నుంచి హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్లు. ఐపీఎల్ టోర్నీలో మొదటగా హ్యాట్రిక్ తీసింది మన బాలాజీనే. 2008లో అప్పటి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుపై హ్యాట్రిక్ పడగొట్టాడు. ఇక విదేశీ ఆటగాళ్లలో మఖయ ఎంతిని,  సునీల్ నరైన్, షేన్ వాట్సన్, శామ్యూల్ బద్రి, ఆండ్రూ టై, సామ్ కరన్ హ్యాట్రిక్ తీశారు. 


Also Read: MS Dhoni Captaincy: అభిమానులకు షాకింగ్ న్యూస్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ! చెన్నై నయా కెప్టెన్ ఎవరంటే?


Also Read: Insomnia Causes: నిద్రలేమితో బాధపడుతున్న యువకులు.. సోషల్ మీడియానే కారణం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook