MS Dhoni Captaincy: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ! సీఎస్‌కే నయా కెప్టెన్ ఎవరంటే?

MS Dhoni Steps Down As Chennai Super Kings Captain. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సారథి ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ముందు చెన్నై​ కెప్టెన్​గా తప్పుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 03:33 PM IST
  • ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం
  • కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ
  • సీఎస్కే నయా కెప్టెన్ ఎవరంటే?
MS Dhoni Captaincy: అభిమానులకు భారీ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ! సీఎస్‌కే నయా కెప్టెన్ ఎవరంటే?

MS Dhoni Steps Down As Chennai Super Kings Captain: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సారథి ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ముందు చెన్నై​ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ సోషల్​ మీడియాలో పేర్కొంది. 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో అంతర్భాగంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఇకపై కెప్టెన్ బాధ్యతలు మోయనున్నాడు. అయితే కెప్టెన్‌గా తప్పుకున్నా.. ఆటగాడిగా మాత్రం మహీ కొనసాగనున్నారు.

లీగ్ ఆరంభం అయిన 2008 నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజీకి ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. మహీ సారథ్యంలో 12 సీజన్లు ఆడిన సీఎస్‌కే..​ ఏకంగా 11 సార్లు ప్లేఆఫ్స్​ చేరింది. అత్యధికంగా 9 సార్లు ఫైనల్​ ఆడిన చెన్నై.. నాలుగు సార్లు టైటిల్​ను గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో 2010, 2011, 2018, 2021లో చెన్నై ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2020లో మాత్రమే చెన్నై లీగ్ దశ దాటలేకపోయింది. ఇంతటి ఘన చరిత్ర ఏ ప్రాంచైజీకి లేదు.

2008 నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రాంచైజీకి ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉండగా.. మహీ గైర్హాజరీలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా సారథ్యం వహించారు. చెన్నైకి రవీంద్ర జడేజా మూడో కెప్టెన్ మాత్రమే. మెగా లీగ్‌లో ప్రతి ప్రాంచైజీలో ఎందరో కెప్టెన్‌లు మారినా.. సీఎస్‌కేకు మాత్రం 'ఒకే ఒక్కడు'గా మహీ ఉన్నారు. 

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీతో ఎంఎస్ ధోనీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ, సీఎస్‌కేను విడదీసి చూడలేరు చెన్నై అభిమానులు. మహీని అక్కడి ఫాన్స్ ముద్దుగా 'తలా' అని పిలుచుకుంటారు. అలాంటిది సీజన్‌ ఆరంభానికి ముందు మిస్టర్‌ కూల్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అభిమానులు షాకయ్యారు. ఉన్నపళంగా కెప్టెన్‌గా తప్పుకోవడంతో మహీ ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!

Also Read: Supreme Court: కరోనా మృతుల పరిహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News