Dwayne Bravo says CSK Captain MS Dhoni helped my career personally: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫునే ఆడాడు. 2011 నుంచి సీఎస్‌కేతోనే కొనసాగాడు. అయితే ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వచ్చే ఏడాది ఆరంభంలో భారీ వేలం నిర్వహించనుంది. దాంతో బీసీసీఐ రూల్స్ ప్రకారం అన్ని జట్లు కొందరి ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకున్నాయి. చెన్నై ప్రాంచైజీ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ మరియు మొయిన్ అలీలను రెటైన్ చేసుకుంది. దాంతో బ్రావో వేలంలోకి రానున్నాడు. అయితే వేలంలో తనను చెన్నై తీసుకుంటుందో లేదో తెలియదు అని బ్రావో అన్నాడు. అలానే చెన్నై సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni)తో తన బంధంను మరోసారి గుర్తుచేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన డ్వేన్ బ్రావో.. ఆ జట్టు సారథి ఎంఎస్ ధోనీతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఇద్దరు సోదరుల్లా ఉంటారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం కూడా ఉంది. బ్రావోకు మహీ అండగా నిలుస్తూ కెరీర్‌కు ఎంతో దోహదం చేశాడు. ఇదే విషయాన్ని బ్రావో తాజాగా తన ఫ్యాషన్ లేబుల్ Djb47లో గుర్తుచేసుకున్నాడు. 'ధోనీని నేను సొంత సోదరుడిగా భావిస్తానని అందరికి తెలుసు. మా మధ్య బలమైన స్నేహం ఉంది. ఆటకు అతడు బ్రాండ్ అంబాసిడర్. మహీ నా కెరీర్‌కు వ్యక్తిగతంగా ఎంతో సహాయం చేశాడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మరువను' అని బ్రావో అన్నాడు. 


Also Read: Mitchell Starc: తొలి బంతికే వికెట్.. 85 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మిచెల్ స్టార్క్‌!!


'సీఎస్‌కేతో ఎంఎస్ ధోనీ, నాకు గొప్ప అనుబంధం ఉంది. చెన్నై అత్యంత ఆకర్షనీయమైన ప్రాంచైజీగా ఎదగడంలో మా ఇద్దరి పాత్ర ఉంది. అది ఎప్పుడూ చరిత్ర పుస్తకాలలో ఉంటుంది. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది, అదే అన్నిటికంటే ముఖ్యమైనది. చెన్నై నన్ను రెటైన్ చేసుకోలేదు. కానీ ఈసారి వేలంలోకి వస్తాను. వేలంలో 100 శాతం ఉంటాను. ఏ జట్టుతో నా కెరీర్ ముగుస్తుందో చూడాలి. చెన్నై నన్ను తీసుకుంటుందో లేదో. వేలంలో ఉన్నందున ఏ జట్టు అయినా తీసుకోవచ్చు' అని డ్వేన్ బ్రావో పేర్కొన్నాడు. 


Also Read: Army Helicopter crashed in Tamil Nadu: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్.. చాపర్‌లో Bipin Rawat


38 ఏళ్ల ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌ 2021 అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 17 ఏళ్లకు పైగా కెరీర్‌కు శుభం కార్డు పడింది. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించి.. ఏడాది తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నాడు. బ్రావో విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. ఇక 151 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook