IPL 2022 Auction: విరాట్ వైపు పరుగెత్తి.. నీకు ఏది అనిపిస్తే అది చెప్పు! చహల్‌కు సలహా ఇచ్చిన కోచ్!!
Chahal on Kohli: విరాట్ కోహ్లీ అంటే భయపడేవాడినని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ గుర్తు చేసుకున్నాడు. 8 ఏళ్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్.. ఐపీఎల్ 2022 కోసం వేలంలోకి వచ్చాడు.
Yuzvendra Chahal about Virat Kohli's Aggression: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పిన్ మాయాజాలంతో పాటు చిలిపితనం కూడా మనోడికి బాగానే ఉంటుంది. మ్యాచ్ జరుగుతుండగానే సహచరులను ఆకపట్టిస్తుంటాడు. యూజీకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో టీమిండియా ఆటగాళ్లను ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాడు. ఆ సమయంలో చాలా ఫన్ క్రియేట్ చేస్తాడు. అలాంటి చహల్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి భయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే చెప్పాడు.
యుజ్వేంద్ర చహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చాలా ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఆడాడు. దాదాపుగా 8 ఏళ్లు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2022 కోసం బెంగళూరు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. దాంతో చహల్ వేలంలోకి వచ్చాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ.. కోహ్లీ తన కెరీర్‌పై చూపిన ప్రభావంపై స్పందించాడు.
'నేను 2014లో తొలిసారి బెంగళూరు జట్టుకు ఆడాను. అప్పుడు చాలా ఆందోళనగా ఉండేది. మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తే భయమేసేది. నేను బౌలింగ్ చేసేటప్పుడు కోహ్లీ భయ్యా కవర్స్‌లో ఫీల్డింగ్ చేసేవాడు. ఆ సమయంలో అతడు చాలా అగ్రెసివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండేవాడు. అప్పుడు నేను యవకుడిగా ఉండటంతో.. వికెట్లు తీయకపోతే ఒక్కోసారి నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. అప్పుడు కాస్త నిరాశకు లోనయ్యేవాడిని' అని మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్ అన్నాడు.
'వికెట్లు తీసినప్పుడు మాత్రం నా కోపాన్ని ప్రదర్శించడానికి విరాట్ కోహ్లీ వైపు వెళ్లకుండా బ్యాట్స్‌మెన్ వద్దకు వెళ్లేవాడిని. అలా 2-3సార్లు జరగడంతో మ్యాచ్ రిఫరీ నా గురించి అప్పటి బెంగళూరు కోచ్ డానియల్ వెటోరీకి చెప్పాడు. ఆ సమయంలోనే నేను ఓ మ్యాచ్‌లో అతిగా మాట్లాడాను. దాంతో వెటోరీ నా వద్దకు వచ్చి హెచ్చరించాడు. నైపుణ్యం ఉన్న మాత్రాన ఇలా చేయడం సరికాదన్నారు. వికెట్లు తీసినప్పుడు పరిగెత్తాలనిపిస్తే కవర్స్‌వైపు పరిగెత్తమని సలహా ఇచ్చాడు. అక్కడ ఉండే విరాట్ కోహ్లీతో నీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పమని చెప్పాడు' అని యూజీ గుర్తుచేసుకున్నాడు.
Also Read: Balakrishna on Hindupur District: హిందూపురం కోసం ఎమ్మెల్యే పదవికైనా రాజీనామా చేస్తా: బాలకృష్ణ
Also Read: Pushpa Collection: 'తగ్గేదే లే'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న పుష్ప.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook