Pushpa Collection: 'తగ్గేదే లే'.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Pushpa 50 Days Collections: అల్లు అర్జున్‌, రష్మిక కాంబినేషనల్‌లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్‌' సినిమా 50 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 02:07 PM IST
  • డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు పుష్ప
  • బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప
  • మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Pushpa Collection: 'తగ్గేదే లే'.. బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Pushpa 50 Days Collections: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన సినిమా 'పుష్ప: ది రైజ్‌'. 2021 డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప రిలీజ్ అయి 50 రోజులు పూర్తయినా, ఓటీటీలో విడుదల అయినా కలెక్షన్స్ సునామీ మాత్రం అసలు ఆగడం లేదు. బాక్సాఫీస్‌ వద్ద పుష్ప సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. 

పుష్ప సినిమా 50 రోజుల్లో వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 'ఆల్ ఇండియా మాసివ్ బ్లాక్‌బస్టర్‌ పుష్పకి 50 రోజులు. ప్రపంచవ్యాప్తంగా 365 కోట్ల భారీ గ్రాస్‌తో
దూసుకెళుతోంది' అని కాప్షన్ పెట్టింది. 50DaysForBlockbusterPushpa అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేసింది. దాంతో అల్లు అర్జున్‌ ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. 

తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో రూ. 150 కోట్లకి పైగా గ్రాస్ వసూల్ చేసిందని సమాచారం. నైజాంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో, హిందీలో కూడా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. పుష్ప సినిమా మొదటి రోజు 24.9 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి రోజులో కూడా పుష్ప ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'పుష్ప'లో అల్లు అర్జున్‌ 'పుష్ప రాజ్‌'గా నటించారు. బన్నీ తనలోని ఊరమాస్‌ యాంగిల్‌ను జనాలకు పరిచయం చేశాడు. చిత్తూరు యాసలో 'తగ్గేదే లే' అంటూ అతడు చెప్పిన డైలాగ్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. నిజం చెప్పాలంటే.. అల్లు అర్జున్‌ తన నటనతో వన్‌ మ్యాన్‌ షో చేశాడు. శ్రీవల్లి పాత్రలో కన్నడ అందం రష్మిక తనదైన శైలిలో నటించారు. సునీల్, అనసూయ కూడా ఆకట్టుకున్నారు. 

Also Read: Gangubai Kathiawadi Trailer: 'మీ ఇజ్జత్ ఒకసారి పోతే పోయినట్టే.. కానీ రోజు రాత్రి మేము ఇజ్జత్ అమ్ముతాం! లేడీ అర్జున్ రెడ్డా మజాకా!

Also Read: AP Treasury: ట్రెజరీ ఉద్యోగులకు మరో షాక్.. ఆదివారం విధులకు రావాలని ప్రభుత్వ ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News