Full list of IPL 2022 prize money and Awards details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ఆదివారం ఘనంగా ముగిసింది. అరంగేట్ర సీజన్‌లోనే అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (39; 35 బంతుల్లో 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (34) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 ఎడిషన్‌తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రంలోనే ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. దాంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సీవీసీ క్యాపిటల్స్‌ యాజమాన్యానికి మధుర జ్ఞాపకాలు మిగిలాయి. టైటిల్ గెలిచిన గుజరాత్ ఖాతాలో 20 కోట్లు చేరాయి. రన్నరప్ రాజస్థాన్ జట్టుకు 12.5 కోట్లు దక్కాయి. ఇతర అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్లు, వారి ప్రైజ్‌మనీని ఓసారి చూద్దాం. 


ఐపీఎల్ 2022 విజేత: గుజరాత్‌ టైటాన్స్‌
ప్రైజ్‌మనీ: 20 కోట్లు


రన్నరప్‌: రాజస్తాన్‌ రాయల్స్‌
ప్రైజ్‌మనీ: 12.50 కోట్లు


ఆరెంజ్‌ క్యాప్‌: జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌, 863 రన్స్) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌: బట్లర్‌ (రాజస్తాన్‌)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


అత్యధిక సిక్స్‌లు: బట్లర్‌ (రాజస్తాన్‌; 45) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు


మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌: బట్లర్‌ (రాజస్తాన్‌)
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ద సీజన్‌: బట్లర్‌ (రాజస్తాన్‌) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు


పర్పుల్‌ క్యాప్‌: చహల్‌ (రాజస్తాన్‌, 27 వికెట్లు) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌: ఉమ్రాన్‌ మలిక్‌ (హైదరాబాద్‌) 
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


పర్‌ఫెక్ట్‌ క్యాచ్‌ ఆఫ్‌ ద సీజన్‌: ఎవిన్‌ లూయిస్‌ (లక్నో)  
ప్రైజ్‌మనీ: రూ. 10 లక్షలు 


సూపర్‌ స్ట్రయికర్‌ ఆఫ్‌ ద సీజన్‌: దినేశ్‌ కార్తీక్‌ (బెంగళూరు) 
ప్రైజ్‌మనీ: టాటా పంచ్‌ కారు 


Also Read: Sanju Samson: ఫైనల్లో ఓడినందుకు బాదేంలేదు.. జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సంజూ


Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook