CSK vs GT: చివరి వరకూ ఉత్కంఠం..సీఎస్కేపై గుజరాత్ టైటాన్స్ విజయం
CSK vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్. చివరి బంతి వరకూ ఉత్కంఠపోరు. చివరికి మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
CSK vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్. చివరి బంతి వరకూ ఉత్కంఠపోరు. చివరికి మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ 2022 టోర్నీ మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు మరోసారి ఓటమి ఎదురైంది. గుజరాత్ టైటాన్స్ జట్టు మరో విజయాన్ని అందుకుంది. పూణేలో జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠంగా సాగింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 169 పరుగులు చేసింది. చెన్నై సూపర్‌కింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఇప్పటి వరకూ అన్ని మ్యాచ్‌లలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి మెరిశాడు. ధాటిగా ఆడుతూ..37 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. మొత్తం 73 పరుగులు చేసి అవుటయ్యాడు. చివరి ఓవర్లలో సైతం పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఆ తరువాత 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రారంభంలో చాలా తడబడింది. ఓ దశలో గుజరాత్ టైటాన్స్ ఓటమి ఖాయమనే అనుకున్నారు. గుజరాత్ వికెట్లు అడపాదడపా పడుతూనే ఉన్నాయి.
డేవిడ్ మిల్లర్ ఒక్కడే ఒంటిచేత్తో ఆడినట్టు ఆడాడు. 51 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా లేకపోవడంతో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు. ఓ దశలో గుజరాత్ టైటాన్స్ విజయానికి 30 బంతుల్లో 75 పరుగులు కావల్సిన పరిస్థితి. అటువంటిది అంతవరకూ స్లోగా ఆడుతూ వచ్చిన రషీద్ ఖాన్ ఒక్కసారిగా విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో 24 పరుగులు చేసి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేశాడు. చివరిగా 2 బంతుల్లో 2 పరుగుల వరకూ మ్యాచ్ ఉత్కంఠం రేపింది. మరో బంతి మిగిలుండగానే గుజరాత్ టైటాన్స్ విజయాన్ని అందుకుంది. సీఎస్కేకు ఓటమి ఎదురైంది.
Also read: PBK vs SRH: పంజాబ్ కింగ్స్‌ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్- వరుసగా నాలుగు విజయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook