CSK VS LSG: MS Dhoni needs 15 runs to complete 7000 T20I runs: టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో గురువారం (మార్చి 31) జరిగే మ్యాచ్‌లో మహీ మరో 15 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్‌లో 7000 పరుగుల మైలరాయిని అందుకుంటాడు. ధోనీ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో 7 వేల ప‌రుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. లక్నో మ్యాచులో 15 పరుగులు చేస్తే.. ఐదో టీమిండియా ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు 7వేల పరుగులు చేసిన తొలి కీపర్‌గా నిలుస్తాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ఫార్మాట్లో ఎంఎస్ ధోనీ ఇప్ప‌టివ‌ర‌కు 6,985 ప‌రుగులు చేశాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్లో 1617 ప‌రుగులు చేసిన మహీ.. ఐపీఎల్‌ టోర్నీలో 4,796 ప‌రుగులు చేశాడు. ఇక ఛాంపియ‌న్స్ లీగ్ వంటి ఇత‌ర టీ20 లీగ్‌ల్లో 517 ప‌రుగులు చేశాడు. ఈరోజు ధోనీ చారిత్రక రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇదివరకు విరాట్ కోహ్లీ (10326), రోహిత్ శర్మ (9936), శిఖర్ ధావన్ (8818), రాబిన్ ఊతప్ప (7070) టీ20 ఫార్మాట్లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 14562 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 


ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన మహీ.. అభిమానులను అలరించాడు. మునుపటి మహీని తలపించడంతో ఫాన్స్ స్టేడియంలో తెగ సందడి చేశారు. గతంలో మాదిరిగా జట్టు క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బ్యాటింగ్‌కు వ‌చ్చిన మహీ చెన్నైని ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే అత‌నికి ఇత‌ర బ్యాట‌ర్ల నుంచి సహకారం ల‌భించ‌క‌వ‌పోవ‌డంతో జట్టుకు భారీ స్కోర్ అందించ‌లేక‌పోయాడు. 


ఐపీఎల్‌ 2022లో ఈరోజు మ‌రో ఆస‌క్తిర పోరు జరగనుంది. ఈరోజు డిఫెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. బ్ర‌బోర్న్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7 గంటలకు టాస్ ప్[ఆడనుండగా.. 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జ‌ట్లు త‌మ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి లీగ్‌లో బోణీ కొట్టాలని చూస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. 


Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్‌.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!


Also Read: Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్‌ ఫైర్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook