LSG vs CSK: దంచికొట్టిన చెన్నై బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్! మొదటి కీపర్‌గా ధోనీ అరుదైన రికార్డు!!
IPL 2022, CSK VS LSG. బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. లక్నో ముందు 211 పరుగుల లక్ష్యంను ఉంచింది.
Robin Uthappa, Shivam Dube blitz powers Chennai to 210: బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసి.. లక్నో ముందు 211 పరుగుల లక్ష్యంను ఉంచింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప (50; 27 బంతుల్లో 8x4, 1x6) హాఫ్ సెంచరీ చేయగా.. శివమ్ దుబె (49; 30 బంతుల్లో 5x4, 2x6) తృటిలో అర్ధ శతకం పూర్తిచేశాడు. ఇనింగ్స్ చివరలో మొయిన్ అలీ (35), అంబటి రాయుడు (27) వేగంగా ఆడారు. లక్నో బౌలర్లు అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) రనౌట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడినా రాబిన్ ఉతప్ప ధాటిగానే ఆడాడు. అతనికి మొయిన్ అలీ కూడా తోడయ్యాడు. దాంతో చెన్నై స్కోర్ పరుగులు పెట్టింది. ఆండ్రూ టై వేసిన ఐదో ఓవర్‌లో ఊతప్ప నాలుగు ఫోర్లు బాదగా.. కృనాల్ పాండ్యా వేసిన 6వ ఓవర్‌లో అలీ 4, 6, 4 బాదాడు. దాంతో సీఎస్‌కే పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.
రవి బిష్ణోయ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి ఊతప్ప హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అదే ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే మొయిన్ అలీని ఆవేశ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ సమయంలో శివమ్ దూబే, అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. భారీ సిక్సర్లు, బౌండరీలు బాదుతూ రన్ రేట్ పడిపోకుండా చూశారు. రాయుడిని బిష్ణోయ్ ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన దుబెని ఆవేశ్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ బాదిన ధోనీ.. మరో ఫోర్‌తో జట్టు స్కోర్‌ను 200కు చేర్చాడు. చివరి ఓవర్లో ఫోర్ బాదిన జడేజా (17).. ఆ వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ధోనీ 6 బంతుల్లో 16 పరుగులు చేసి.. టీ20 క్రికెట్‌లో 7000 పరుగులు సాధించిన మొదటి కీపర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!
Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook