DC vs PBKS: దంచికొట్టిన షా, వార్నర్.. పంజాబ్‌పై ఢిల్లీ సునాయాస విజయం!

IPL 2022, DC vs PBKS: elhi Capitals defeated Punjab Kings by 9 wickets. ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది.
IPL 2022, Delhi Capitals defeated Punjab Kings by 9 wickets: ఐపీఎల్ 2022లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాస విజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 10.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌లు డేవిడ్ వార్నర్ (60 నాటౌట్; 30 బంతుల్లో 10x4, 1x6), పృథ్వీ షా (41; 20 బంతుల్లో 7x4, 1x6) దంచికొట్టారు. షా ఔటైనప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ (12)తో కలిసి వార్నర్ ఢిల్లీని విజయతీరానికి చేర్చాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరు మ్యాచులు ఆడి మూడు విజయాలు అందుకుంది. ఆరు పాయింట్లతో ప్రస్తుతం ఆరో స్థానంకు దూసుకొచ్చింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షాలు మంచి ఆరంభం ఇచ్చారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీల మోత మోగించారు. వైభవ్ అరోరా వేసిన ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు రావడంతో పంజాబ్ సగం మ్యాచ్ కోల్పోయింది. ఓపెనర్ల ధాటికి ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన షాను రాహుల్ చహర్ ఔట్ చేశాడు. దాంతో 83 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది.
ఓ వికెట్ పడినా కూడా డేవిడ్ వార్నర్ ధాటిగానే ఆడాడు. ఈ క్రమంలో నాథన్ ఎల్లిస్ వేసిన 10వ ఓవర్‌లో బౌండరీ బాది 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ చహర్ వేసిన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సర్ఫరాజ్ ఖాన్ (12) అతడికి అండగా నిలిచాడు. పంజాబ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఓక వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. త్వరగా ముగిసిన మ్యాచ్ ఇదే.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. జితేశ్ శర్మ (32; 23 బంతుల్లో 5x4), మయాంక్ అగర్వాల్ (24; 15 బంతుల్లో 4x4) టాప్ స్కోరర్లు. శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
Also Read: Number Plate: నువ్వు తోపు సామీ.. రూ. 71 వేల బండికి 15 లక్షల ఫ్యాన్సీ నంబర్! ట్విస్ట్ ఏంటంటే..
Also Read: Nazriya Nazim: నజ్రియా నజీమ్ కోసం చాలామంది ట్రై చేశారు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook