Nazriya Nazim: నజ్రియా నజీమ్‌ కోసం చాలామంది ట్రై చేశారు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Nani intresting comments about Nazriya Nazim. 'అంటే సుందరానికి' సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా నేచురల్‌ స్టార్‌ నాని.. నజ్రియా నజిమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 08:18 PM IST
  • అంటే సుందరానికి టీజర్‌
  • నజ్రియా నజీమ్‌ కోసం చాలామంది ట్రై చేశారు
  • నజ్రియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని
Nazriya Nazim: నజ్రియా నజీమ్‌ కోసం చాలామంది ట్రై చేశారు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Ante Sundaraniki Teaser Launch, Nani intresting comments about Nazriya Nazim: నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'అంటే సుందరానికి'. యువ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'అంటే సుందరానికి' సినిమా జూన్‌ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం టీజర్‌ విడుదల కార్యక్రమం ఏఎంబీ మాల్‌లో జరిగింది. 

'అంటే సుందరానికి' సినిమా టీజర్‌ విడుదల సందర్భంగా హీరో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా గత చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌ టీజర్‌ని ఏఎంబీ మాల్‌లోని ఇదే స్క్రీన్‌లో విడుదల చేశాం. ఆ సినిమా ఎంత బాగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్లీ ఇదే ప్లేస్‌లో అంటే సుందరానికీ చిత్రం టీజర్‌ రిలీజ్‌ చేశాం. ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉండనుందో మాకు ముందే తెలిసిపోయింది. ప్రేక్షకుల సమక్షంలో టీజర్‌ రిలీజ్‌ చేయడం నాకు ఓ సెంటిమెంట్‌లా అయిపోయేలా ఉంది' అని అన్నాడు. 

'దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఏ సినిమా చేసినా చాలా కష్టపడుతాడు. ఓ కథను వివేక్‌ తప్ప వేరే ఎవరూ బాగా చెప్పలేరు. అంటే సుందరానికి సినిమా నాకెంతో ప్రత్యేకం. బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది. ఇక నజ్రియాని తెలుగు సినిమాల్లోకి తీసుకురావాలని గతంలో ఎంతో మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. ఎవరు ఫోన్లు చేసినా లిఫ్ట్‌ చేయలేదు, చేసినా ఒప్పుకోలేదు. మా సినిమాలో నటించడానికి మాత్రం ఒప్పుకుంది. కథ నచ్చి సినిమా చేశారు. అందుకు ఆమెకు ధన్యవాదాలు చెపుతున్నా. చాలా సంతోషంగా ఉంది' అని నాని తెలిపాడు. 

అంటే సుందరానికి టీజర్‌కు రెండు రెట్లు ట్రైలర్‌ ఉంటుందని, పది రెట్లు సినిమా ఉంటుందిని నాని చెప్పుకొచ్చాడు. కామెడీ, ఫ్యామిలీ  సినిమాలే కాకుండా అన్ని రకాల సినిమాలు చేస్తానని.. మీ అందరికీ విందు భోజనం పెడతానన్నారు. పాన్‌ ఇండియా అంటే ఏమిటో తనకు తెలియదని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఆకట్టుకునే సినిమాలు చేస్తే అదే పాన్‌ ఇండియా సినిమాలు అని తాను నమ్ముతానని నాని చెప్పుకొచ్చాడు. 

Also Read: AVAK Trailer: మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు! మటన్ ముక్క కూడా గావాలి

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా పాజిటివ్.. నేటి మ్యాచ్‌‌ వాయిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News