IPL 2022 DC vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని వరుస ఓటములతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేటు మెయింటెన్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున రూ. 12 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం లక్నో సూపర్ జెయింట్స్ తో ఢిల్లీ జట్టు తలపడింది. ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి లక్నో తొలుత బౌలింగ్  చేసింది. ఈక్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 


లక్ష్య చేధనకు బరిలోకి దిగిన లక్నో 19.4 ఓవర్లలోనే 4 వికెట్లను నష్టపోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈమ్యాచ్‌లో కనీస ఓవర్‌ రేటు మెయింటెన్ చేయని కారణంగా జరిమానా పడింది. ఈసీజన్‌లో ఢిల్లీకి మొదటి తప్పిదం కావడంతో 12 లక్షల ఫైన్ వేశారు. 


ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం రెండోసారి అదే తప్పు చేస్తే 24 లక్షలు, తుది జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. మూడోసారి కూడా అదే రిపీట్ అయితే కెప్టెన్‌కు 30 లక్షల జరిమానాతోపాటు ఓ మ్యాచ్‌లో నిషేధం, తుది జట్టులోని ప్రతి ఆటగాడికి 12 లక్షల జరిమానా, మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. 


మరోవైపు వరుస ఓటములతో ఉన్న ఢిల్లీ తదుపరి మ్యాచ్‌లో 10న కోల్‌కతాతో తలపడనుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఓ మ్యాచ్‌లో గెలిచి రెండింటిలో ఓడిపోయింది. డేవిడ్ వార్నర్, అన్రిచ్ జట్టులోకి వచ్చినా పరిస్థితి మారలేదు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీషా ఆకట్టుకున్నా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని ఢిల్లీ జట్టు భావిస్తోంది. 


Also Read: LSG vs Delhi: దూకుడుగా ఆడటంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్... 149కే కట్టడి చేసిన లక్నో...


Also Read: Delhi Capitals: డిల్లీ కేపిటల్స్ జట్టుకు శుభవార్త, అందుబాటులో వచ్చిన వార్నర్, అన్రిచ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook