Hardik Pandya hugs his wife Natasa Stankovic after Gujarat Titans wins IPl 2022 Title: ఐపీఎల్‌ 2022 ఆదివారం (మే 29) ఘనంగా ముగిసింది. అరంగేట్ర సీజన్‌లోనే అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ 2022 టైటిల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (34) కీలక ఇన్నింగ్స్ ఆడారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యాపై విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో లేని హార్దిక్‌ ఎలా పరుగులు చేస్తాడు, ఆల్‌రౌండర్‌గా ఎలా రాణిస్తాడు, కెప్టెన్‌గా ఏం ఆకట్టుకుంటాడో అని అందరూ ట్రోల్స్ చేశారు. కానీ హార్దిక్‌ వాటన్నింటిని పటాపంచలు చేశాడు. అరంగేట్రం సీజన్‌లోనే టైటిల్‌ అందించి చరిత్ర సృష్టించాడు. లీగ్‌ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్‌.. తానెంత గొప్ప ఆల్‌రౌండర్‌ అనేది మరోసారి నిరూపించాడు. కెప్టెన్‌గా రాణించడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటాడు. 



జట్టు పగ్గాలు అందుకున్న తొలిసారే.. అదికూడా కొత్త జట్టును ఛాంపియన్‌గా నిలిపి హార్దిక్‌ పాండ్యా చరిత్ర సృష్టించాడు. దాంతో హార్దిక్‌ బావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ విజయం అనంతరం మైదానంలోకి భార్య నటాసా స్టాంకోవిక్ రాగానే.. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. మరోవైపు స్టాంకోవిక్ కూడా పాండ్యాను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆమెను హార్దిక్ ఓదార్చాడు. హార్దిక్ కూడా కాస్త ఎమోషనల్ కావడంతో ఆమె హార్దిక్‌ను ఓదార్చింది. ఇందుకు సబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 


Also Read: IPL 2022 Final: సరికొత్త రికార్డు నెలకొల్పిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ప్రపంచంలోనే మొట్టమొదటి మ్యాచ్!


Also Read: IPL 2022 Final Fixing: ఒక్క సిక్సూ కొట్టని స్టార్ ప్లేయర్.. ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్స్ అయిందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook