IPL 2022 Final Fixing: ఒక్క సిక్సూ కొట్టని స్టార్ ప్లేయర్.. ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్స్ అయిందా?

IPL 2022 Final GT vs RR. Fixing trends on Twitter. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ తక్కువ స్కోర్ చేయడం, జోస్ బట్లర్ నెమ్మదిగా ఆడడం లాంటి పలు కారణాలతో.. ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 11:24 AM IST
  • ఒక్క సిక్సూ కొట్టని స్టార్ ప్లేయర్
  • ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్స్ అయిందా?
  • ఇండియన్ పొలిటికల్ లీగ్
IPL 2022 Final Fixing: ఒక్క సిక్సూ కొట్టని స్టార్ ప్లేయర్.. ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్స్ అయిందా?

Fixing trends on Twitter after Gujarat Titans beat Rajasthan Royals in IPL 2022 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 15వ సీజన్ ఆదివారం ఘనంగా ముగిసింది. అరంగేట్ర సీజన్‌లోనే అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ 2022 టైటిల్‌ సొంతంచేసుకుంది. ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (34), డెవిడ్‌ మిల్లర్‌ (32 నాటౌట్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఐపీఎల్ 2022లో ఓపెనర్ జోస్ బట్లర్ పరుగుల వరద పారించాడు. తుదిపోరు ముందువరకు నాలుగు సెంచరీలు బాదిన బట్లర్.. ఫైనల్‌లోనూ భారీ స్కోర్ చేస్తాడని రాజస్థాన్‌ రాయల్స్ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆశలు అడియాశలయ్యాయి. జోరుమీదున్న బట్లర్ 35 బంతుల్లో 39 రన్స్ చేశాడు. అందులోనూ మొదటి ఓవర్ నుంచే సిక్సులు బాదే ఈ ఇంగ్లీష్ ప్లేయర్.. అన్ని బంతులు ఆడి కూడా ఒక్క సిక్సర్ బాధలేదు. సంజూ శాంసన్ 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇక దేవదత్ పడిక్కల్ 10 బంతుల్లో 2 రన్స్ మాత్రమే చేశాడు. 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ కార్యదర్శి జై షా సహా పలువురు ప్రముఖులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చారు. ఇక దాదాపుగా 1,25,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. హోమ్ టీమ్ కావడంతో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకే అందరూ మద్దతు ఇచ్చారు. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ తక్కువ స్కోర్ చేయడం, జోస్ బట్లర్ నెమ్మదిగా ఆడడం లాంటి పలు కారణాలతో.. ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

అయితే సోషల్ మీడియాలో ఈ ఆరోపణలు మాములే అయినా.. ఈసారి నెటిజన్లు తమ గళంను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతిఒక్కరు ట్వీట్, మీమ్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా మీమ్స్‌ బాగా వైరల్ అయ్యాయి. 'ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు.. ఇండియన్ పొలిటికల్ లీగ్', 'వచ్చే ఎలెక్షన్స్ గుజరాత్ లోనే' అంటూ ట్వీట్లు వస్తున్నాయి. దాంతో నెట్టింట #Fixing అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో టాప్ ప్లేయర్స్ వీళ్లే.. చెత్త రికార్డులు ఇవే!

Also Read: Singer Death: ప్రముఖ సింగర్ మృతి... స్టేజీపై పాడుతూనే కుప్పకూలిన గాయకుడు... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News