IPL 2022 final match likely to start from 8 pm on May 29th: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్లే ఆఫ్‌ బెర్తులు చివరి మ్యాచ్ వరకు వెళ్లాయి. ఇప్పటి రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఏకంగా ఐదు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు రోజుల్లో ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఆదివారం (మే 29) అహ్మదాబాద్‌ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో రెండు మ్యాచులు ఉంటే.. మొదటి గేమ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫైనల్ మ్యాచ్ మే 29న రాత్రి 7.30 గంటలకు మొదలవ్వాల్సి ఉంది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టాస్‌ 7.30 గంటలకు పడనుందట. 


ఐపీఎల్ 2022 ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్‌ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ముగింపు రోజున అదనపు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను అద్భుతంగా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోందట. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారని తెలుస్తోంది. ముగింపు వేడుకలు సాయంత్రం 6:30కు మొదలై దాదాపుగా 40 నిమిషాల పాటు కొనసాగనున్నాయట. 


ఐపీఎల్ 2022 లీగ్‌ స్థాయిలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 24 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. కోల్‌కతాలో క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఫైనల్‌ జరుగనుంది. ఈసారి ఏ జట్టు కప్ కొడుతుందో చూడాలి.  


Also Read: Viral Video: ఇదేందయ్యో ఇది.. ఇలాంటి చేపను ఎక్కడా చూడలే! ఊసరవెల్లిలా రంగు మార్చుతోంది..


Also Read: Niharika Konidela: భర్తకు నిహారిక లిప్‌లాక్‌.. రెచ్చిపోయిన నెటిజన్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.