Dale Steyn likely to join SHR as bowling coach: దక్షిణాఫ్రికా 'స్పీడ్‌ గన్‌' డేల్ స్టెయిన్.. మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లోకి పునరాగమనం చేయబోతున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా మాత్రం కాదు.. కోచ్‌గా రాబోతున్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) బౌలింగ్‌ కోచ్‌గా స్టెయిన్ (Dale Steyn) బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ (unrisers Hyderabad) ఫ్రాంచైజీ స్టెయిన్‌తో మాట్లాడిందని, వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందిని సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నీలో డేల్ స్టెయిన్ ఇదివరకే సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీతో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. 2013-15 మధ్య కాలంలో స్టెయిన్ సన్‌రైజర్స్‌ తరఫున ఆడాడు. అంతకుముందు 2011-12 మధ్య అప్పటి డెక్కన్ ఛార్జర్స్ (DC) జట్టుకు సేవలందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2021 అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ తమ పదవులకు రాజీనామా చేశారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కూడా నియమితుడవ్వడంతో జట్టుకు కొత్త కోచింగ్ సిబ్బంది అవసరం ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ టామ్ మూడీ.. ఇప్పుడు ప్రధాన కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. డేల్ స్టెయిన్ (Dale Steyn) బౌలింగ్‌ కోచ్‌గా రానున్నాడట. ఇక టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ హేమంగ్ బదానీ కూడా సన్‌రైజర్స్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Rashmika Mandanna: 'పుష్ప' ప్రెస్ మీట్‌లో రష్మిక డ్యాన్స్.. సామి సామి అంటూ రచ్చ (వీడియో)!!


ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం వచ్చే ఏడాది ఆరంభంలో మెగా వేలం జరగనుంది. కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) ప్రాంచైజీ అట్టిపెట్టుకుంది. గత కొంత కాలంగా విఫలమవుతున్న నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు అవసరం అని ప్రాంచైజీకి తెలిసొచ్చింది. వచ్చే వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకోనుందని సమాచారం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలను పటిష్టం చేయనుందట. ఒకవేళ డేల్ స్టెయిన్ జట్టులో ఉంటే.. మంచి బౌలర్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఏదేమైనా స్టెయిన్ ఉంటే ప్రత్యర్థులకు చుక్కలే అని చెప్పొచ్చు. 


Also Read: Jos Buttler: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన జోస్ బట్లర్.. బిత్తరపోయిన ఆస్ట్రేలియా ఓపెనర్ (వీడియో)


38 ఏళ్ల డేల్ స్టెయిన్‌ (Dale Steyn) ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ ఆరంభం నుంచి తన వేగం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. నిలకడగా బంతులు వేస్తూ స్టార్ బ్యాటర్‌లకు  చేమలుపట్టించేవాడు. దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్‌ 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. ఇక 95 ఐపీఎల్‌ మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు. ఐపీఎల్ టోర్నీలో డెక్కన్ ఛార్జర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్లకు దక్షిణాఫ్రికా 'స్పీడ్‌ గన్‌' ప్రాతినిధ్యం వహించాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook