IPL 2022: గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్ లకు స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 % ప్రేక్షకులకు అనుమతి
గత రెండు సీజన్ లు కరోనా కారణంగా అభిమానుల లేకుండానే గడిచాయి, కానీ ఈ సారి 25శాతం మంది ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు మురిసిపోతున్నారు.
IPL 2022: మార్చ్ 26 తేదీ నుండి ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీవీ ముందు చూడటం కన్నా స్టేడియంలో మ్యాచ్ చూడటమే చాలా మందికి కిక్ ఇస్తుంది. అన్ని దేశాల జట్ల ఆటగాళ్లు, మన దేశ ఆటగాళ్లు అందరు కలిసి ఆడే మ్యాచ్ లలో ఇష్టమైన ఆటగాళ్ల అందరికి ఒకే చోట చూడటం క్రికెట్ అభిమనులకి మంచి పండగ అని చెప్పవచ్చు.
గత రెండు సీజన్ లు కరోనా కారణంగా అభిమానుల లేకుండానే గడిచాయి. ఆటగాళ్లలో, అభిమానులలో ఎదో నిరాశ మాత్రం ఉండిపోయింది. ఇక విషయానికి వస్తే, ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
ఈ సీజన్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐతే కోవిడ్ నిబంధనలు పక్కగా పాటించాలని స్పష్టం చేసింది. 25 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇందులోభాగంగా బీసీసీఐ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఈనెల 26న వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమవుతుంది.
అభిమానులను తిరిగి అలరించేందుకు ఐపీఎల్ 15వ సీజన్ సిద్ధమైందని.. అభిమానులందరికీ ఘనస్వాగతం అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.మార్చి 26 నుంచి మే 29 వరకు దాదాపు రెండు నెలలపాటు ఈ సీజన్ అలరించనుంది. ముంబై, పుణెలోని నాలుగు మైదానాల్లో ఈమ్యాచ్‌లు జరుగుతాయి. కోవిడ్ దృష్ట్యా ఆటగాళ్లు దూర ప్రయాణాలు లేకుండా బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.
వాంఖడే, డివై పాటిల్ స్టేడియాల్లో 20, బ్రాబొర్నె స్టేడియం, పుణెలోని ఎంఏసీ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడుతాయి. దీని కోసం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.
Also Read: Boycott RRR in Karnataka: 'ఆర్ఆర్ఆర్'కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...
Also Read: COVID Restrictions: మార్చి 31 తర్వాత కొవిడ్ ఆంక్షలన్నీ ఎత్తివేత- కానీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook