IPL 2022 Latest Updates: తాజా ఐపీఎల్‌ సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. మంగళవారం (మే 10) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం ద్వారా గుజరాత్ ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ను 144 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన లక్నో... బ్యాటింగ్‌లో విఫలమవడంతో ఓటమిని మూటగట్టుకుంది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నో పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ రాణించడంతో 4 వికెట్లకు 144 పరుగుల స్కోర్ చేయగలిగింది. శుభ్‌మన్ మినహా గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. లక్నో బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.


145 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో ఏ దశలోనూ గట్టి పోటీ కనబర్చలేదు. 3 ఓవర్లో డికాక్ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన లక్నో... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్ చేరారు. క్వింటన్ డికాక్ (11), దీపక్ హుడా (27) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. దీంతో 82 పరుగులకే లక్నో జట్టు కుప్పకూలింది.


ఈ సీజన్‌లో గుజరాత్, లక్నో రెండు కొత్త జట్లే. మిగతా జట్ల కన్నా ఈ జట్లు మెరుగ్గా రాణిస్తున్నాయి. నిన్నటివరకూ 11 మ్యాచ్‌లు ఆడి ఎనిమిదింట గెలిచి రెండు సమవుజ్జీలుగా ఉన్నాయి. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్ గెలవడంతో ప్లేఆఫ్స్‌లో ఆ జట్టుకు బెర్త్ ఖరారైంది. లక్నో మరో మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. 



Also Read: ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లిన గుజరాత్... ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన తొలి జట్టు...


Also Read:Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook