Patel vs Parag: పటేల్, పరాగ్‌ల మాటల యుద్ధం, ఒకరిపై మరొకరు దూసుకుపోయి...
Patel vs Parag: ఐపీఎల్ 2022 ఎంత రసవత్తరంగా సాగుతున్నా..ఆటగాళ్లలో మాత్రం స్పోర్టివ్ స్పిరిట్ కొరవడుతుంది. వికెట్ తీసినప్పుడో..బౌలర్‌ను చితకబాదినప్పుడో ఏదో సాధించామనే కసితో..అవతలి వ్యక్తుల్ని హీనంగా చూడటం, దూషణకు దిగడం పరిపాటిగా మారింది.
Patel vs Parag: ఐపీఎల్ 2022 ఎంత రసవత్తరంగా సాగుతున్నా..ఆటగాళ్లలో మాత్రం స్పోర్టివ్ స్పిరిట్ కొరవడుతుంది. వికెట్ తీసినప్పుడో..బౌలర్‌ను చితకబాదినప్పుడో ఏదో సాధించామనే కసితో..అవతలి వ్యక్తుల్ని హీనంగా చూడటం, దూషణకు దిగడం పరిపాటిగా మారింది.
క్రికెట్ ఓ హుందా గేమ్ ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం స్పోర్టివ్ స్పిరిట్ ఆటగాళ్లలో పూర్తిగా పోతోంది. సత్తా సామర్ధ్యాలు ఆటవరకే పరిమితం చేయడం లేదు. వికెట్ తీసినప్పుడు బౌలర్ సహనం కోల్పోతున్నాడు. భారీ పరుగులు సాధించినప్పుడు బ్యాటర్‌లో కసి పెరిగిపోతోంది. ఏదో సాధించేశామనే గర్వంతో వివిధ రకాల హావభావాలతో ప్రత్యర్ధుల వైపు చులకనగా చూడటం లేదా పరుషంగా మాట్లాడటం లేదా దూషించడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితే తలెత్తింది. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్‌లో రియన్ పరాగ్ వర్సెస్ హర్షల్ పటేల్ వ్యవహారమిది.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 20 వ ఓవర్ తరువాత చోటుచేసుకున్న పరిణామమిది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియన్ పరాగ్..పెవిలియన్ వైపుకు వెళ్తూ..తిరిగి వెనక్కి తిరిగాడు. హర్షల్ పటేల్ వైపు చూస్తూ ఏవో పరుషంగా మాట్లాడాడు. పరాగ్‌కు మరో ఆర్ఆర్ బ్యాటర్ మద్దతుగా నిలిచాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కారణం తెలియదు. ఒకరికొకరు కొట్టుకునేంత పనిచేశారు. ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు. మాటలు విసురుకున్నారు. ఏం తిట్టుకున్నారో..కారణమేంటనేది ఇంకా తెలియదు. ఈ వీడియా మాత్రం వైరల్ అవుతోంది.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రియన్ పరాగ్ ఏకంగా 18 పరుగులు సాధించాడు. ఫలితంగా ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేయగలిగింది. ఈ చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ వచ్చాయి. ఆ చివరి ఓవర్ తరువాతే రియాన్ పరాగ్, హర్షల్ పటేల్ మధ్య ఘర్షణకు దారితీసింది.
Also read: RR vs RCB: కోహ్లీ మరోసారి విఫలం, రాజస్థాన్ రాయల్స్‌పై ఆర్సీబీ ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.