RR vs RCB: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోరుకే ఆలవుట్ అయింది.
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆర్ఆర్ సత్తా చాటింది. ఈ మ్యాచ్ మొత్తం బౌలర్లదే ఆధిపత్యంలా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బౌలర్ల ధాటికి రియాన్ పరాగ్ తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేదు. రియాన్ పరాగ్ 56 పరుగులు సాధించాడు. సిరాజ్, హేజల్‌వుడ్, హసరంగలు రెండేసి వికెట్లు తీయగా, హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. బెంగళూరు బౌలర్ల జోరుకు బట్లర్ ముందుగానే అవుటోపోయాడు.
ఆ తరవాత 145 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీకు అదే కష్టాలు ప్రారంభమయ్యాయి. టీమ్ ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు కూడా త్వరగానే అవుటైపోయారు. ఓ దశలో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దినేష్ కార్తిక్ అనవసరంగా రనవుట్ అయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ పూర్తిగా చతికిలపడిపోయింది. కేవలం 115 పరుగులకే ఆలవుట్ అయింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 3వ స్థానంలో నిలవగా..ఆర్సీబీ 5వ స్థానానికి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.