IPL 2022 Mega Auction: పంజాబ్‌కు అల్ రౌండర్ లివింగ్ స్టోన్- రూ.11.50 కోట్లకు కొనగోలు
IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం 2022లో మరో ప్లేయర్ భారీ ధర పలికాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివిగ్ స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
IPL 2022 Mega Auction: బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ఉత్కంఠగా కొనసాగుతోంది. రీటైన్ లిస్ట్‌లో లోని ప్లేయర్స్‌ను పది ఐపీఎల్ టీమ్స్ వేలంలో కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివిగ్ స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
లివింగ్ స్టోన్ కోసం టీమ్‌లు మధ్య తీవ్ర పోటీ కనిపించింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) టీమ్స్ లివింగ్ స్టోన్ కోసం పోటా పోటీ ప్రయత్నాలు చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కూడా లివింగ్ స్టోన్ కోసం పోటీ పడగా.. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.50 కోట్లకు దక్కించుకుంది.
ఇక రెండో రోజు వేలంలో ఇండియన్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బిడ్డింగ్ మొదటి రౌండ్లో అన్‌సోల్డ్ ప్లేయర్స్‌గా మిగిలారు.
రెండో రోజు వేలం ప్రారంభమైంది ఇలా..
రెండో రోరజు మెగా వేలం దక్షిణఆఫ్రికా బ్యాటర్ ఎయిడెడ్ మార్క్రమ్కు బిడ్డింగ్‌తో ప్రారంభమైంది. మార్క్రమ్ను ఎస్ఆర్హెచ్ రూ.2.6 కోట్లకు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత ఇండియన్ బ్యాటర్ అనిదీప్ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది.
తొలి రోజు వీళ్లకే అత్యధికం..
తొలి రోజు వేలంలో.. ఇషాన్ కిషన్ (రూ.15.2 కోట్లు- ముంబయి ఇండియన్స్), దీపక్ చాహర్ (రూ.14 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్), శ్రేయస్ అయ్యర్ (రూ.12.25 కోట్లు- కేకేఆర్) అత్యధిక రేటు పలికిన ప్లేయర్స్‌గా నిలిచారు.
Also read: Eoin Morgan Unsold: పాపం మోర్గాన్.. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
Also read: Aiden Markram SRH: రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప.. తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook