Aiden Markram SRH: రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప.. తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్!!

IPL Mega Auction 2022 Live Updates: రెండో రోజు ఐపీఎల్ 2022 వేలం ఆరంభం కాగా.. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) కొనుగోలు చేసింది

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 01:10 PM IST
  • రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప
  • రెండో రోజు తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్
  • లక్నో పోటీకి వచ్చినా.. కావ్య వెనక్కి తగ్గలేదు
Aiden Markram SRH: రెండో రోజు 'తగ్గేదే లే' అన్న కావ్య పాప.. తొలి ఆటగాడినే పట్టేసిన సన్‌రైజర్స్!!

SRH bought Aiden Markram for Rs 2.60 Crore: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం తొలి రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) మధ్యాహ్నం కానీ ఓ ఆటగాడికి బిడ్ వేయలేదు. మధ్యాహ్నం తర్వాత మనీశ్ పాండే కోసం తొలి బిడ్ వేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్.. వాషింగ్టన్ సుందర్‌ను తొలి ఆటగాడిగా కైవసం చేసుకుంది. అయితే రెండో రోజు మాత్రం వేలంలోకి వచ్చిన తొలి ఆటగాడినే కొనుగోలు చేసింది. 

రెండో రోజు వేలం ఆరంభం కాగా.. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ వేలంలోకి వచ్చాడు. మార్క్రామ్ కనీస ధర ఒక కోటి కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే ధరకు బిడ్ వేసింది. గుజరాత్, లక్నో పోటీకి వచ్చినా.. కావ్య మారన్ వెనక్కి తగ్గలేదు. చివరకు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో రెండో రోజు అమ్ముడైన ఆటగాడిగా.. మార్క్రామ్ నిలిచాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు అతడు ఆడిన విషయం తెలిసిందే. 

ఐడెన్ మార్క్రామ్ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌.  రైట్ హ్యాండ్ బ్యాటింగ్ మరియు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. మార్క్రామ్ ప్రస్తుతం ప్రొటీస్ జట్టుకు కీలక ఆటగాడు. టెస్టులు, వన్డేలు మరియు టీ20లలో దక్షిణాఫ్రికాకు రెగ్యులర్‌గా ఆడతాడు. దక్షిణాఫ్రికా జట్టుకు మార్క్రామ్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. దక్షిణాఫ్రికా తరఫున మార్క్రామ్ 29 టెస్టులు, 37 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. 

ఐడెన్ మార్క్రామ్‌ను కొనుగోలు చేసిన అనంతరం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య మారన్ తగ్గలేదు. లియామ్ లివింగ్‌స్టోన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టుతో పోటీ పడింది. 11 కోట్ల వరకు అతడి కోసం ప్రయత్నించింది. పంజాబ్ వెనక్కి తగ్గకపోవడంతో కావ్య అతడిని వదిలేసింది. ఇక ఓడియన్ స్మిత్ కోసం పంజాబ్ జట్టుతో పోరాడింది. చివకు పంజాబ్ అతడిని 6 కోట్లకు కైవసం చేసుకుంది. తొలిరోజు మౌనంగా ఉన్న కావ్య.. రెండో రోజు మాత్రం 'తగ్గేదే లే' అంటుంది. 

Also Read: SRH Squad: కొందరినే తీసుకున్నా.. కావ్య పాప మంచి ఆటగాళ్లనే పట్టింది! సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇదే!!

Also Read: IPL 2022 Auction Day 1: వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లు వీరే.. స్టార్ ఆటగాళ్లకు కూడా తప్పని నిరాశ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News