IPL mega auction was slated to take place in January: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మెగా వేలానికి ఇంకా నెల రోజులే మిగిలి ఉంది. సంబంధిత వర్గాల ప్రకారం.. 2022 జనవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించే (IPL mega auction date) వీలుంది. ఇందులో పది టీమ్​లు (Ten teams in IPL) పాల్గొననున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎనిమిది టీమ్​లు ఇప్పటికే ఐపీఎల్​లో ఉండగా.. ఇప్పుడు కొత్తగా (New teams in IPL) రెండు టీమ్​లు (లఖ్​నవూ, అహ్మదాబాద్​లు) వచ్చి చేరాయి.


మెగా వేలానికి ముందు ప్రస్తుతం టీమ్​లో ఉన్న వారిలో ముగ్గురు ప్లేయర్స్​ను రీటైన్​ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు, ఒక ఫారిన్ ప్లేయర్​ ఉండాలనే నిబంధన విధించింది. గత నెల 30తోనే ఈ గడువు ముగిసింది. అంతకు ముందే ఎనిమిది టీమ్​లు తమ రీటైన్ జాబితాను ఐపీఎల్ (IPL latest news) పాలక మండలికి సమర్పించాయి.


కొత్త ఫ్రాంఛైజీల​కు ఈ నెల 25 వరకు అవకాశం..


కొత్తగా వచ్చిన ఐపీఎల్​ టీమ్​లు మెగా వేలానికి ముందు.. ముగ్గురు ప్లేయర్స్​ (ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు, ఒక విదేశీ ఆటగాడు) ను తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది పాలక మండలి. మిగతా 8 ఫ్రాంఛైజీల రిటైన్ జాబితాలో లేని ప్లేయర్స్​ను నేరుగా తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది.


ఇక ఈ సారి మెగా వేలంలో ఒక్కో టీమ్​కు​ రూ.90 కోట్ల పరిమితి విధించిది పాలక మండలి. రీటైన్ చేసుకున్న ప్లేయర్స్​కు ఇచ్చిన మొత్తాన్ని పక్కనబెట్టి మిగిలిన మొత్తంతో మాత్రమే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.


ఈ సారి ఏ టీమ్​కు కూడా రైట్​ టూ మ్యాచ్ (ఆర్​టీఎం) కార్ట్ వినియోగించుకునే (IPL Megha Auction rules) అవకాశం లేదు.


రీటైన్​​ తర్వాత టీమ్స్ వద్ద మిగిలిన మొత్తం..


ఈ సారి వేలంలో పంజాబ్ కింగ్స్ (PBKS)​ రూ.72 కోట్లతో వేలానికి రానుంది. సన్​ రైజర్స్ హైదరాబాద్ (SRH​) రూ.68 కోట్లతో వేలంలో పాల్గొననుంది.


రాజస్థాన్​ రాయల్స్ (RR) వద్ద వేలం కోసం రూ.62 కోట్లు ఉన్నాయి. రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.57 కోట్లతో వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది.


ముంబయి ఇండియన్స్ (MI), చెన్నై సూపర్​ కింగ్స్ (CSK), కోల్​కతా నైట్​ రైడర్స్ (KKR) వద్ద రూ.48 కోట్ల చొప్పున వేలం కోసం వినియోగించేందుకు నిధులు ఉన్నాయి.


ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అత్యల్పంగా రూ.47 కోట్లు మాత్రమే వేలం కోసం మిగిలి ఉన్నాయి.


ఇక కొత్త టీమ్స్ లఖ్​నవూ, అహ్మదాబాద్​ రూ.90 కోట్ల చొప్పున వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వేలానికి ముందు ముగ్గురు చొప్పున తీసుకునే ప్లేయర్స్ కూడా ఇందులో నుంచే కేటాయించాల్సి ఉంటుంది.


Also read: Sourav Ganguly: కోహ్లీ లేకుండానే టీమ్ ఇండియాకు టైటిల్, రోహిత్‌పై గంగూలీ ప్రశంసలు


Also read: IND Vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook