IND Vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?!!

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టూర్‌లో వన్డే సిరీస్‌కు విరాట్ దూరంగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిసిస్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 02:40 PM IST
  • దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్
  • వన్డే సిరీస్‌కు దూరంగా విరాట్ కోహ్లీ
  • విరాట్‌ కోహ్లీకి భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ
IND Vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?!!

Virat Kohli may withdraw his name from ODI Series against South Africa: టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించి.. రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు ఆ బాధ్యతలు అప్పగించింది. నిజానికి టీ20 ప్రపంచకప్‌ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం సారథిగా కొనసాగాలని అనుకున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ కోహ్లీని తప్పించి రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. దీంతో విరాట్ తీవ్ర అసహానానికి గురైనట్లు సమాచారం తెలుస్తోంది.  

త్వరలోనే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు వెళ్లనుంది. డిసెంబర్‌ 26న ప్రొటీస్ టూర్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టూర్‌లో వన్డే సిరీస్‌ (ODI Series)కు విరాట్ దూరంగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిసిస్తున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌కు తాను అందుబాటులో ఉండనని బీసీసీఐ సెలెక్టర్లకు చెప్పనున్నాడట. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. వన్డే జట్టును ప్రకటించే వరకు వేచిఉండాల్సిందే. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు ఇప్పటికే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇంకా వన్డే సిరీస్‌కు టీంను ప్రకటించాల్సి ఉంది. 

Also Read: Happy Birthday Rajinikanth: ఒక్కో సినిమాకు రజనీ కాంత్‌ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?.. ఫ్లాప్ అయితే మాత్రం!!

భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య డిసెంబర్‌ 26న నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుండగా.. జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ వన్డే సిరీస్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) జట్టు పగ్గాలు అందుకుంటాడు. విరాట్ కోహ్లీ గైహాజరీలో రోహిత్ భారత జట్టును నడిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ టీ20, వన్డేలకు కెప్టెన్ కాగా.. టెస్టులకు విరాట్ సారథిగా ఉన్నాడు. డిసెంబర్‌ 26న సెంచూరియాన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది.  

Also Read: Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం పవన్ కల్యాణ్ సంఘీభావ దీక్ష

భారత టెస్ట్‌ జట్టు: 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News