IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!
ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో జరుగుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
IPL 2022 mega auction will take place on February 12 and 13 in Bengaluru: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 కోసం ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కసరత్తులు చేస్తోంది. 2022 సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ మెగా వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్నో (Lucknow) మరియు అహ్మదాబాద్ (Ahmedabad)లతో పాటు ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొననున్నాయి. దాంతో ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా వేలం కోసం ఫ్రాంచైజీలతో పాటుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలం (IPL 2022 Mega Auction)ను బీసీసీఐ ఫిబ్రవరిలో నిర్వహిచనుందని సమాచారం తెలుస్తోంది. ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో బెంగళూరులో వేలం జరుగుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. IPL 2022 మెగా వేలం 2018 మాదిరిగానే రెండు రోజుల పాటు జరగనుంది. వేలం వేదిక రేసులో హైదరాబాద్ కూడా ఉన్నా.. చివరకు బెంగళూరు (Bengaluru) వైపే మొగ్గుచూపారు. ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల కారణంగా వేలం వాయిదా పడింది.
Also Read: New Covid-19 Variant: ఫ్రాన్స్‌లో కరోనా కొత్త వేరియంట్.. ఇప్పటికే 12 మందికి పాజిటివ్!!
ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 12 మరియు 13 తేదీలలో మధ్యాహ్నం వేలం ఆరంభం కానుందట. అయితే బీసీసీఐ నుంచి వేలంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బీసీసీఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు మెగా వేలం కోసం 90 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలు 19 మంది భారతీయ మరియు 8 విదేశీ ఆటగాళ్ల (మొత్తం 27 మంది ప్లేయర్స్)ను అట్టిపెట్టుకున్నాయి.
IPL 2022లో సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని లక్నో ఫ్రాంచైజీతో పాటు వెంచర్ క్యాపిటల్ సంస్థ (CVC) యాజమాన్యంలోని అహ్మదాబాద్ క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేస్తోంది. రెండు జట్లూ ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఆటగాళ్లను ఎంచుకునే తేదీపై ఇంకా క్లారిటీ లేదు. లక్నో ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ (KL Rahul), అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తారని సమాచారం తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ మరియు హార్దిక్ పాండ్యాలను తీసుకునేందుకు అహ్మదాబాద్.. రషీద్ ఖాన్ కోసం లక్నో ఆసక్తిగా ఉన్నాయట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook