IPL 2022, MI vs LSG: ఐపీఎల్‌-2022లో (IPL 2022) భాగంగా.. శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూప‌ర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగడంతో... ముంబయిపై ల‌క్నో 18 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. రాహుల్ 60 బంతుల్లో 103 పరుగులు చేసి లక్నోకు నాల్గో విజయాన్ని కట్టబెట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఇక‌ ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు (KL Rahul ) భారీ షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో (Mumbai Indians) జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రాహుల్‌ పై రూ.12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. "ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయని కారణంగా రాహుల్‌పై రూ.12 ల‌క్ష‌లు జరిమానా  విధించబడింది" అని ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 


శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో మెుదట బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ (Lucknow Super Giants) 200 పరుగుల భారీ లక్ష్యాన్ని రోహిత్ సేన ముందు ఉంచింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబయి 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. లఖ్‌నవూ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 3 వికెట్లు తీశాడు. 


Also Read: MI vs LSG, IPL 2022: కేఎల్ రాహుల్ సెంచరీ, మళ్లీ ఓడిన ముంబయి ఇండియన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook