IPL 2022 Play Off Chances: ఐపీఎల్ 2022 కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకం. మొన్నటి వరకూ వరుస విజయాలు..ఇప్పుడు ఓటములు. ప్లే ఆఫ్ అవకాశాలు ఎవరెవరికున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోయిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అది కూడా పంజాబ్, ముంబై చేతుల్లో ఓటమిపాలైంది. ఇంకా గుజరాత్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మూడింట్లోనూ పరాజయం పాలైతే..గుజరాత్ టాప్ 4లో నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి వచ్చేసింది. వరుసగా కోల్‌కతా, ముంబై చేతుల్లో ఓటమి పాలైంది. టీమ్ బ్యాటర్లలో సంజూ శాంసన్ లేదా బట్లర్ మాత్రమే రాణిస్తున్నారు. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సిన ఉన్న రాజస్థాన్ రాయల్స్..ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే.


ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి మరీ ఘోరం. వరుస రెండు పరాజయాల తరువాత అద్భుతంగా పుంజుకుని ఐదు విజయాలు నమోదు చేసింది. అంతా బాగుందనుకునే తరుణంలో తిరిగి వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. పది పాయింట్లతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం మూడింట గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు. ఇక ఆర్సీబీ పరిస్థితి కాస్త ఫరవాలేదు. వరుసగా మూడు ఓటములతో నైరాశ్యానికి లోనైనా..తిరిగి చెన్నైపై విజయంతో గాడిన పడినట్టుంది. కోహ్లీ, డుప్లెసిస్, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ రాణిస్తే టీమ్‌కు తిరిగుండదు. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తేనే ఆర్సీబీకు ప్లే ఆఫ్ అవకాశాలు..


ఇక ఢిల్లీ, పంజాబ్ జట్లు అటు ఇటూ ఊగిసలాడుతున్నాయి. ఒక మ్యాచ్ గెలిస్తే..మరో మ్యాచ్ ఓడిపోతున్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. పోటీ తీవ్రంగానే ఉండనుంది.


Also read: PBKS vs RR: పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్, ఎవరి బలమెంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.