IPL 2022 Playoff Chances: ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్‌కు దాదాపుగా చేరాయి. టేబుల్ టాపర్స్ జాబితాలో చోటు కోసం పోటీ పడుతున్న మిగిలిన జట్లు ఏవో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో ఈసారి కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరాయి. టాటా ఐపీఎల్ 2022లో టేబుల్ టాపర్స్‌గా టాప్ 4 జట్లు ఏవనేది ఇంకా తేలలేదు. 11 మ్యాచ్‌లలో 16 పాయింట్లు సాధించి..గుజరాత్ టైటాన్స్ తరువాత నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ పట్ల ఆ టీమ్ యాజమాన్యం సంతృప్తిగా ఉంది. మధ్యలో 2-3 ఓటములు ఎదురైనా సరే..ఆ తరవాత తిరిగి కోలుకుంది. మిగిలిన రెండు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ చేరువలో ఉన్నాయి.


రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు సాధించి..నెట్ రన్‌రేట్ 0.326 కలిగి ఉంది. అటు ఆర్సీబీ నెట్ రన్‌రేట్..ఆర్ఆర్ కంటే తక్కువే ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు..పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 75 పరుగుల తేడాతో విజయం సాధించడం ఆ జట్లకు కలిసొచ్చిందని చెప్పాలి. అటు ఆర్సీబీ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 67 పరుగుల తేడాతో విజయం సాధించడం కూడా ఆ జట్టుకు ప్లస్‌గా మారింది. అదే సమయంలో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి పుంజుకోవడం, 91 పరుగుల తేడాతో ఢిల్లీ కేపిటల్స్ జట్టుపై విజయం సాధించడం మరో కీలక పరిణామం. 


ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ , ఆర్సీబీ జట్లు టేబుల్ టాపర్స్‌లో 3,4 స్థానాలు దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిగిలిన 3 మ్యాచ్‌లను భారీ తేడాతో గెల్చి..రన్‌రేట్ మెరుగుపర్చుకుంటేనే ఈ రెండింటిలో ఏదో ఒక జట్టును వెనక్కి నెట్టి టాప్ 4లో నిలవగలదు. ఆర్ఆర్, ఆర్సీబీ జట్ల తరువాత ప్లే ఆఫ్ అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటే అది కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకే. ఢిల్లీ కేపిటల్స్, పంజాబ్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. 


Also read: MS Dhoni Bat: అందుకే ఎంఎస్ ధోనీ బ్యాట్‌ కొరుకుతాడు.. అసలు విషయం చెప్పేసిన అమిత్‌ మిశ్రా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook