PBKS vs DC Playing 11: పంజాబ్, ఢిల్లీ మధ్య `డు ఆర్ డై` ఫైట్.. ఓడిన జట్టు ఇంటికే! తుది జట్లు ఇవే
IPL 2022, Punjab Kings opt to bowl vs Delhi Capitals. ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం (మే 16) బిగ్ ఫైట్ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
IPL 2022, Punjab Kings vs Delhi Capitals Playing 11 out: ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం (మే 16) బిగ్ ఫైట్ జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ బెర్తుకు చేరువగా వెళుతుంది. ఓడిన జట్టు దాదాపుగా ఇంటికి రావాల్సి ఉంటుంది. అందుకే మ్యాచ్ గెలిచేందుకు పంజాబ్, ఢిల్లీ జట్లు చూస్తాయి. రాజస్థాన్ చేతిలో లక్నో ఓడిపోవడంతో.. ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ఈక్వేషన్స్ రసవత్తరంగా మారాయి.
గుజరాత్ టైటాన్స్ 20 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్దానాల కోసం ఆరు జట్ల (రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) మధ్య పోటీ నెలకొంది. పంజాబ్, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో 12 మ్యాచులలో చెరో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో సమంగా ఉన్నాయి. పంజాబ్ (0.023)తో పోలిస్తే.. ఢిల్లీ (0.210) నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఢిల్లీ జట్టులో క్యాపిటల్స్ లీడింగ్ వికెట్ టేకర్ ఖలీల్ అహ్మద్ తిరిగి వచ్చాడు. చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ జట్టులోకి వచ్చాడు. అలాగే కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రావ్‌మెన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్ట్‌జీ, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ, రిషి ధావన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్.
Also Read: Women's T20 Challenge: మే 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్.. మిథాలీ, ఝులన్‌కు నిరాశ!
Also Read: Nabha Natesh Saree Pics: కాటుక కళ్లతో మైమరిపిస్తున్న నభా నటేష్.. పల్లెటూరి వనితలా వయ్యారాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.