Nabha Natesh Saree Pics: కాటుక కళ్లతో మైమరిపిస్తున్న నభా నటేష్.. పల్లెటూరి వనితలా వయ్యారాలు!

Nabha Natesh Latest Saree PhotoShoot shakes internet. తాజాగా నభా నటేష్ చీరకట్టులో ఫోటో షూట్ చేశారు. అందులో కన్నడ బ్యూటీ పల్లెటూరి వనితలా వయ్యారాలు వలకబోస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 06:13 PM IST
  • చీరకట్టులో నభా నటేష్ ఫోటో షూట్
  • పల్లెటూరి వనితలా వయ్యారాలు
  • కాటుక కళ్లతో మైమరిపిస్తున్న నభా
Nabha Natesh Saree Pics: కాటుక కళ్లతో మైమరిపిస్తున్న నభా నటేష్.. పల్లెటూరి వనితలా వయ్యారాలు!

Tollywood actress Nabha Natesh looks gorgeous in Latest Saree Images: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ బ్యూటీ 'నభా నటేష్'. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డా.. పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా నభా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో కన్నడ బ్యూటీ తెలంగాణ యాసలో అదరగొట్టారు. దాంతో తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ అనంతరం నభా నటేష్ డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే నభా అందాలకు కుర్రకారు మాత్రం ఫిదా అయ్యారు. గతేడాది విడుదలైన నితిన్ 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా కూడా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. దాంతో ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్ హిట్ కోసం నభా ఎదురుచూస్తున్నారు.

ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని కన్నడ భామ నభా నటేష్.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తున్నారు. ముఖ్యంగా ఆమె నడుమందాలకు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. 

తాజాగా నభా నటేష్ చీరకట్టులో ఫోటో షూట్ చేశారు. అందులో కన్నడ బ్యూటీ పల్లెటూరి వనితలా వయ్యారాలు వలకబోస్తున్నారు. కళ్లకు కాటుక పెట్టుకుని.. మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తున్నారు. పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో నభా సిగ్గుపడుతూ అందంగా ఉన్నారు.  ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు 'కల కొనసాగుతుంది' అని నభా పేర్కొన్నారు.

Also Read: Women's T20 Challenge: మే 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్.. మిథాలీ, ఝులన్‌కు నిరాశ!

Also Read: 'సర్కారు వారి పాట' సినిమా చూసేందుకు.. ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News