Rovman Powell says David Warner denied to complete his century in Final Over: క్రికెట్ ఆటలో బ్యాటర్‌కు సెంచరీ.. బౌలర్‌కు ఫైవ్ వికెట్ హాల్ ఎంతో ప్రత్యేకం. అందుకే ఈ మైలురాళ్లను అందుకోవాలని ప్రతి ప్లేయర్ చూస్తుంటారు. అయితే ఈ అవకాశం కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. వచ్చిన ఆ అవకాశాన్ని మాత్రం ఎవరూ వదులుకోరు. ముఖ్యంగా బ్యాటర్ చివరి ఓవర్లో తన సెంచరీకి అవసరమైన రన్స్ తీయాలనే చూస్తాడు. కానీ ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అవకాశం ఉన్నా.. సెంచరీ చేయలేదు. తన సెంచరీ కంటే జట్టుకు స్కోరే ముఖ్యమని సహచర ఆటగాడికి క్లాస్ పీకాడు. విషయంలోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి కడవరకు క్రీజులో నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వార్నర్‌.. ఆ తర్వాత చెలరేగాడు. ఈ సీజన్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను వార్నర్‌ ఓ ఆటాడుకున్నాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారించాడు. మొత్తానికి వార్నర్‌ సహా రోవ్‌మన్ పోవెల్ కూడా దంచికొట్టడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. 


అయితే చివరి ఓవర్‌లో డేవిడ్ వార్నర్‌కు సెంచరీ చేసే అవకాశం వచ్చింది. 19వ ఓవర్ వరకు 92 పరుగులు చేసిన వార్నర్‌.. చివరి ఓవర్లో 8 పరుగులు చేస్తే సెంచరీ చేశాడు. తనకు అవకాశం ఉన్నా జట్టు మేలునే కోరుకున్నాడట. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పోవెల్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం పోవెల్ మాట్లాడుతూ... '20వ ఓవర్ ప్రారంభంలో డేవిడ్ వార్నర్‌ వద్దకు వెళ్ళాను. సింగిల్ తీసి నీకు స్ట్రైకింగ్ ఇవ్వాలా? అని అడిగాను. ఆ మాట అనగానే నాకు క్లాస్ పీకాడు. అలాంటి క్రికెట్ మనం ఆడకూడదు. నా సెంచరీ కోసం అలాంటి క్రికెట్ ఆడొద్దు.. నీ సాయశక్తులా బంతిని బాదేందుకే ప్రయత్నించు అని చెప్పాడు' అని తెలిపాడు. 


బ్యాటింగ్ ఆర్డర్‌లో తన ప్రమోషన్ గురించి కెప్టెన్ రిషబ్ పంత్‌తో జరిగిన సంభాషణను కూడా విండీస్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ వివరించాడు. 'కొన్ని రోజుల క్రితమే రిషబ్ పంత్‌తో నా బ్యాటింగ్ గురించి మాట్లాడాను. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తావని నన్ను అడిగాడు. నాపై నమ్మకం ఉంచి 5వ స్థానంలో బ్యాటింగ్‌కుజ దింపండి అని చెప్పా. గత సంవత్సరంలో స్పిన్ ఆడే సామర్థ్యంను మెరుపరుచుకున్నానని చెప్పాను. నెం.5లో నన్ను నమ్మి పంపు అని కోరాను. ఈ మ్యాచులో అవకాశం వచ్చింది. అలానే నన్ను నేను నిరూపించుకున్నా' అని పావెల్ చెప్పుకొచ్చాడు. 


Also Read: AVAK Twitter Review: 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?


Also Read: SVP Mass Song: ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.