AVAK Twitter Review: 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?

Vishwak Sen AVAK Review.'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ అంటూ ట్వీట్ల వర్షం కురుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 01:28 PM IST
  • 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ
  • ఏవీఏకే రివ్యూ ఎలా ఉందంటే?
  • విశ్వ‌క్ సేన్ నటన బాగుంది
AVAK Twitter Review: 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?

Vishwak Sen starrer Ashoka Vanamlo Arjuna Kalyanam Twitter Review: 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' సినిమాతో మంచి హిట్ కొట్టిన టాలీవుడ్ యువ హీరో విశ్వ‌క్‌ సేన్.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. విశ్వ‌క్ సేన్ నటించిన తాజా సినిమాల్లో 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' ఒకటి. విద్యాసాగ‌ర్ చింత దర్శకత్వం వహించిన ఏవీఎకేను సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. పలు కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈరోజు (మే 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా విడుదలకు 4-5 రోజుల ముందు విశ్వ‌క్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో పెద్ద దుమారమే రేపింది. ఏవీఏకే ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్ రోడ్డుపై విశ్వక్ సేన్ ప్రాంక్‌ వీడియో చేయడం, ప్రమోషన్‌ పేరిట నడి రోడ్డుపై న్యూసెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారని ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ డిబెట్‌ నిర్వహించడం, ఆ డిబెట్‌లో హీరో విశ్వక్‌ సేన్ పాల్గొని అసభ్య పదజాలం ఉపయోగించడం, అనంతరం క్షమాపణలు చెప్పడం లాంటి పరిణామాలు జరిగాయి. దాంతో ఏవీఎకే సినిమాకు పైసా ఖర్చులేకుండా భారీ స్థాయిలో ప్రొమోషన్ జరిగింది. 

'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా పాటలు, ట్రైలర్ బాగుండడం ఓవైపు.. ఏవీఎకే విడుదలకు ముందే ప్రాంక్‌ వీడియో వైరల్ అవ్వడం మరోవైపు వెరిసి సినిమాపై మంచి హైప్ నెలకొంది. దాంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. మరి ప్రాంక్‌ వీడియో సినిమాకు కలిసొచ్చిందా లేదా అనే విషయం ప్రేక్షకుల మాటల్లో ఓసారి తెలుసుకుందాం. సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ అంటూ ట్వీట్ల వర్షం కురుస్తోంది. 

'ఏవీఎకే సినిమా మంచి అనుభూతిని కలిగించింది. నిజ జీవితంలో అందరూ ఎదుర్కొనే సన్నివేశాలు బాగున్నాయి' అని ఒకరు ట్వీట్  చేయగా.. 'పూర్తి ఫామిలీ ఎంటర్ టైనర్.. విశ్వ‌క్ సేన్ నటన బాగుంది. రుక్సర్ థిల్లాన్ వెండితెరపై బాగుంది' అని ఒకొకరు ట్వీట్ చేశారు. 'చాలా అందమైన చిత్రం. గత రెండు నెలలుగా ఈ హెవీ డ్యూటీ యాక్షన్ చిత్రాల తర్వాత ఆహ్లాదకరమైన అనుభూతిని ఇచ్చింది', 'ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్', 'ఇంకోసారి చూడాలనిపిస్తుంది సినిమా' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Also Read: SVP Mass Song: ఫ్యాన్స్‌కి మహేష్ బాబు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌.. అదేంటంటే!

Also Read: Pooja Hegde New Film: హ్య‌ట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా త‌గ్గ‌ని పూజా హెగ్డే జోరు.. మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News