RR vs RCB: టాస్ గెలిచిన బెంగళూరు.. మార్పుల్లేకుండా బరిలోకి ఇరు జట్లు! బెంచ్ పైనే మాక్స్వెల్
Royal Challengers Bangalore opt to bowl. ముంబైలోని వాంఖడే మైదానంలో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, RR vs RCB Playing 11 is Out: ఐపీఎల్ 2022లో మరికొద్దిసేపట్లో మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో డుప్లెసిస్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు రాజస్థాన్ కూడా గత మ్యాచులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుందని ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచులు ఆడి.. ఒకదాంట్లో గెలిచి మరోదాంట్లో ఓడి ఏడవ స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయంపై రాజస్థాన్ కన్నేయగా.. మరో విజయం సాధించాలని బెంగళూరు బరిలోకి దిగుతోంది. ఇరుజట్ల మధ్య 22 మ్యాచ్‌లు జరగ్గా.. బెంగళూరు 12, రాజస్థాన్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ (కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
Also Read: Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక.. నేషనల్ క్రష్ ఫస్ట్ లుక్ అవుట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook