Beast Telugu Trailer: భయంగా ఉందా.. దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది! బీస్ట్‌ తెలుగు ట్రైలర్‌ చూస్తే మతిపోవాల్సిందే

Vijay's Beast Telugu Trailer out. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం బీస్ట్‌.. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 06:12 PM IST
  • వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ విడుదల
  • నేను పొలిటీషియన్ కాదు.. ఓ సోల్జర్
  • బీస్ట్‌ తెలుగు ట్రైలర్‌ చూస్తే మతిపోవాల్సిందే
Beast Telugu Trailer: భయంగా ఉందా.. దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది! బీస్ట్‌ తెలుగు ట్రైలర్‌ చూస్తే మతిపోవాల్సిందే

Thalapathy Vijay, Pooja Hegde's Beast Telugu Trailer is Out: కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్‌, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. 'వరుణ్ డాక్ట‌ర్' ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దళపతి ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం బీస్ట్‌.. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. తాజాగా తెలుగు, హిందీ ట్రైలర్లను విడుదల చేసింది. తెలుగులో విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాల 55 సెకండ్ల నిడివి గల వీడియోను విడుదల చేశారు. విజయ్ భారీ సంభాషణలతో అలరించారు. 'భయంగా ఉందా.. దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది', 'నేను పొలిటీషియన్ కాదు.. ఓ సోల్జర్', 'మినిస్టర్ చెబుతున్నాడని బెదిరించవయ్యా', 'ఈ ఆటలు అంతా నాకు సెట్ ఎవ్వదు' అనే డైలాగ్స్ బాగున్నాయి. 

ట్రైలర్‌ను బట్టి చూస్తే.. షాపింగ్‌ మాల్‌ను హైజాక్‌ చేసిన ఉగ్రవాదులను ఒక గూఢాచారి ఎలా అంతమొందిచాడన్నదే అసలు కథ అని స్పష్టంగా తెలుస్తోంది. బీస్ట్‌ సినిమా ఉగ్రవాద నేపథ్యంతో సాగనుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించేలా ఉంది. ఇక ట్రైలర్‌లో పూజా హెగ్డే ఓ సెకండ్ పాటు మాత్రమే కనిపించింది. సినిమాలో వీర రాఘవన్‌ అనే మాజీ రా ఏజెంట్‌గా విజయ్‌ కనిపించనున్నారు. బీస్ట్‌ తెలుగు ట్రైలర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ట్రైలర్‌ చూస్తే మతిపోవాల్సిందే అంటూ విజయ్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

బీస్ట్‌ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన 'అర‌బిక్ కుత్తూ', 'జాల్లీ ఓ జింఖానా' సాంగ్స్ హిట్ అయిన విషయం తెలిసిందే. అర‌బిక్ కుత్తూ పాట 25 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా.. జాల్లీ ఓ జింఖానా సాంగ్ కూడా నాలుగు కోట్ల‌కు పైగా వ్యూస్‌ అందుకుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాష‌ల్లో విడుద‌ల‌ కానుంది. దళపతి విజయ్ చివరగా నటించిన బిగిల్, మాస్టర్ సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో.. బీస్ట్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి

Also Read: Rashmika Mandanna: దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక.. నేషనల్ క్రష్ ఫస్ట్ లుక్ అవుట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News