IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!
IPL 2022 Spectators: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ ముంబయి వేదికగా ఇటీవలే ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి కారణంగా మ్యాచ్ లు చూసేందుకు 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించారు. ఇప్పుడు 50 శాతం మందిని మ్యాచ్ చూసేందుకు స్టేడియాల్లోకి అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది.
IPL 2022 Spectators: క్రికెట్ ప్రేమికులు ఎంతో అభిమానించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబయి వేదికగా ఇటీవలే ప్రారంభమైంది. అయితే మహారాష్ట్రలోని కరోనా నిబంధనల ప్రకారం.. మ్యాచ్ లు జరిగే స్టేడియాల్లోకి 25 శాతం ప్రేక్షకులకు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల మహారాష్ట్రలోనూ ఏప్రిల్ 1 నుంచి కొవిడ్ నిబంధనలను సడలించారు. దీంతో క్రికెట్ స్టేడియాల్లోకి 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు అవకాశం ఉంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినట్లు సమాచారం. ఇదే విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. అదే జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండగే!
అప్పటినుంచే 50 శాతం మంది..
ఏప్రిల్ 5 నుంచి 50 శాతం మంది ప్రేక్షకులకు ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు అనుమతించే అవకాశం ఉంది. అందు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ముంబయి క్రికెట్ అసోసియేషన్ ను బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.
దీనిపై రేపో ఎల్లుండో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆన్ లైన్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 5న వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కు 50 శాతం ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది.
Also Read: IPL 2022 CSK VS LSG: చెన్నై X లక్నో.. తొలి విజయాన్ని నమోదు చేసేది ఎవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook