IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త సారధి నేతృత్వంలో ఐపీఎల్ 2022లో దిగుతోంది. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారధ్యం వహిస్తున్న ఎస్ఆర్‌హెచ్ జట్టు బలాబలాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇస్తున్నాయి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ కోసం సంసిద్ధమవుతోంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఘోర వైఫల్యాలు అందుకుంది ఎస్ఆర్‌హెచ్ జట్టు. మొన్న జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో బ్లియన్ లారా, డేల్ స్టెయిన్ వంటి కీలక ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది. నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ఐడన్ మార్క్రామ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో అంచనాలు పెరుగుతున్నాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను కూడా రీటైన్ చేసుకుంది. అటు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను చేర్చుకుంది. రషీద్ ఖాన్‌ను కోల్పోవవడం మాత్రం ఆ జట్టుకు నష్టమే. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ జట్టులో 23 మంది కీలక ఆటగాళ్లున్నారు. ప్లేయింగ్ లెవెన్ ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మిడిల్ ఆర్డర్ గతం కంటే బలంగా మారిందని చెప్పవచ్చు. నికోలస్ పూరన్, ఐదాన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు ఓపెనింగ్ చేయవచ్చు. మూడవ నెంబర్‌లో కెప్టెన్ దిగే అవకాశాలున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుందర్‌తో పాటు మార్క్రామ్, అబ్దుల్ సమద్, అభిషేక్ వంటి పార్ట్ టైమ్ స్పిన్నర్లు జట్టుగా అదనపు బలం కానున్నారు.ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో హైదరాబాద్ జట్టుకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, మార్కో యాన్సన్, రొమారియో షెపర్డ్ లాంటి వారు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ప్రోబెబుల్ లెవెన్‌లో ఉమ్రాన్, భువనేశ్వర్‌లు కచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది.


Also read: ICC Womens World Cup 2022: మిధాలీ సేనపై కంగారూల విజయం, తొలి సెమీఫైనలిస్ట్‌గా ఆస్ట్రేలియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook