IPL 2022 Points Table: ఐపీఎల్ 2022 ప్రారంభమై అప్పుడే  వారం రోజులవుతోంది. స్డేడియంలో పరుగుల వరద కన్పిస్తోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జట్లు ప్రత్యర్ధి జట్లకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏ జట్టుకు ఎన్ని పాయింట్లు లభించాయో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభమై అప్పుడే వారం రోజులవుతోంది. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ టీమ్‌లు సత్తా చాటుతుంటే..ఢిపెండింగ్ ఛాంపియన్ సీఎస్కే చతికిలబడింది. దాంతోపాటు ఐదుసార్లు కప్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఇంకా లేవలేకపోతోంది. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌లలో ఏ టీమ్ ఎన్ని పాయింట్లు గెల్చుకుందో చూద్దాం..


ప్రస్తుతం ఐపీఎల్ 2022లో ఉన్న పది జట్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడి..రెండింటా గెలిచి 4 పాయింట్లు దక్కించుకుంది. ఇక రెండవ స్థానంలో కేకేఆర్ జట్టు 3 మ్యాచ్‌లు ఆడి..రెండింట గెలిచినా రన్‌రేట్ పరంగా బాగుండటంతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి  4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇక నాలుగవ స్థానంలో రెండింట  ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఢిల్లీ కేపిటల్స్ నిలిచింది. 


ఇక మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ రెండింట ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో ఐదవస్థానంలో నిలవగా..ఆర్సీబీ రెండింట ఒక మ్యాచ్ విజయంతో 2 పాయింట్లు సాధించి ఆరవ స్థానంలో నిలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు కూడా రెండింట ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, అంతకుముందు 5 సార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ జట్టు ఇంకా విజయం సాధించలేదు. రెండింట రెండూ కోల్పోయి నిరాశలో ఉన్నాయి. 


Also read: ICC Womens World Cup: విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఏడోసారి ప్రపంచకప్‌ సొంతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook