MS Dhoni: ధోనీకి ప్రత్యామ్నాయం వెతకడం సీఎస్కేకు సాధ్యమేనా, ధోనీ తరువాత మరెవరు
MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయంతో ప్రారంభమైన ధోనీ సారధ్యం..ఇవాళ ఆర్సీబీతో తలపడనుంది.
MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి సీఎస్కే పగ్గాలు చేపట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయంతో ప్రారంభమైన ధోనీ సారధ్యం..ఇవాళ ఆర్సీబీతో తలపడనుంది.
ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా నాయకత్వంలో పూర్తిగా తడబడింది.వరుస పరాజయాలు తట్టుకోలేక జడేజా తిరిగి సారధ్య బాధ్యతల్ని స్వయంగా మహేంద్రసింగ్ ధోనీకి అప్పగించేశాడు. రెండవ సారి సారధ్యం స్వీకరించిన వెంటనే..ధోనీ సేన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
ఐపీఎల్ 2022కు కొద్దిగా ముందు సారధ్య బాథ్యతల్నించి తప్పుకున్న మహి..మరోసారి సీఎస్కే కెప్టెన్ అయ్యాడు. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే..రవీంద్ర జడేజా స్థానంలో బాతలు స్వీకరించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయంతో కెప్టెన్సీ బాధ్యతల్ని సమర్ధవంతంగా ప్రారంభించాడు. ఇవాళ అంటే బుధవారం మే 4వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సీఎస్కే తలపడనుంది. సీఎస్కేలో మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తి మరొకరు లేరని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హోగ్ చెప్పడం విశేషం.
బ్రాడ్ హోగ్ ఏమన్నాడు
ఈ ఏడాది చివర్లో ఎంఎస్ ధోని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న వచ్చినప్పుడు నావరకైతే జట్టును సమర్ధవంతంగా విజయవంతంగా నడిపించే నాయకుడు కన్పించడం లేదు. వచ్చే యేడాది ఆక్షన్‌కు వెళ్లేముందు సీఎస్కే జట్టు ముందుగా కెప్టెన్ కోసం అణ్వేషించాలి. ఎందుకంటే ఇప్పటికే టీమ్ ఇండియా టాప్ ఆటగాళ్లంతా వివిధ ఫ్రాంచైజీలకు కెప్టెన్సీ వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్కేకు సరైన సారధి లభిస్తాడా అనేది చూడాలి.
అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధిగా విదేశీ ఆటగాడిని వెతకాల్సిన అవసరముంది. జట్టును సమర్ధవంతంగా నడిపిస్తూ బ్యాలెన్స్ చేయగల అంతర్జాతీయ స్థాయి ఆటగాడు కావాలి. ఇది కష్టసాధ్యమే కానీ తప్పదు. మరి సీఎస్కే జట్టుకు అంతటి సమర్ధత ఉన్న ఇండియన్ లేదా విదేశీ ఆటగాడు లభిస్తాడా అనేది వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook