Sunrisers Hyderabad Owner Kaviya Maran buy Harry Brook for Rs 13.25 crore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మినీ వేలం ఆరంభం అయింది. కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో వేలం జోరుగా సాగుతోంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (స్‌ఆర్‌హెచ్‌) ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ ఎప్పటిలా కాకుండా.. ఆదిలోనే దూకుడు ప్రదర్శించారు. ఇతర ప్రాంచైజీలతో తీవ్ర పోటీ ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై భారీ మొత్తం వెచ్చించారు. చివరకు రూ. 13.25 కోట్లకు సన్‌రైజర్స్ అతడిని సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లిష్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ కోసం ముందుగా రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. రెండు జట్లు పోటీ పడడంతో రూ. 2 కోట్ల బేస్ ప్రెస్ ఉన్న బ్రూక్‌ ధర ఒక్కసారిగా రూ. 5.25 కోట్లకు చేరింది. ఈ సమయంలో బ్రూక్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రంగంలోకి దిగింది. బెంగళూరు తప్పుకున్నా.. హైదరాబాద్, రాజస్థాన్ గట్టిగా ట్రై చేశాయి. కావ్యా మారన్ తగ్గేదెలా అంటూ బిడ్ వేశారు. దాంతో రాజస్థాన్ వెనక్కి తగ్గింది. చివరకు రూ. 13.25 కోట్లకు సన్‌రైజర్స్ బ్రూక్‌ను కైవసం చేసుకుంది. ఈ ధరతో బ్రూక్‌ రికార్డు సృష్టించాడు.


హ్యారీ బ్రూక్‌ పాకిస్తాన్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ ద్వారా 125 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన బ్రూక్‌... ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. ఇంగ్లండ్ తరఫున బ్రూక్‌ 4 టెస్టులు, 20 టీ20లు ఆడాడు. టీ20ల్లో 372 రన్స్ చేశాడు. యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్ల‌బ్‌కు ఆడే అతడు రైట్ హ్యాండ్ బ్యాట‌ర్, మీడియం పేస్ బౌలింగ్ చేస్తాడు. 



ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు ఈసారి షాక్ తగిలింది. అత‌డిని క‌నీస ధ‌ర రూ. 2 కోట్లకు డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్ సొంతంచేసుకుంది. 2022 వేలంలో కేన్‌ మామను రూ.14 కోట్లు పెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్‌ మాజీ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ను హైదరాబాద్‌ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకొంది.


Also Read: Cheapest Electric Scooters: డెడ్ చీప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ. 45 వేల నుంచి స్టార్ట్! 121 కిమీ ప్రయాణం  


Also Read: Kaikala Satyanarayana Dies: కైకాల సత్యనారాయణ మరణంకు అసలు కారణం ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.