KKR Player Sam Billings pulls out of IPL 2023: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 ప్రారంభానికి ముందు మాజీ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. కేకేఆర్‌ హార్డ్‌ హిట్టర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ (ఇంగ్లండ్‌) ఐపీఎల్‌ 2023 నుంచి వైదొలిగాడు. తాను ఐపీఎల్‌ 2023 నుంచి వైదోగుతున్నట్లు స్వయంగా బిల్లింగ్స్‌ నేడు వెల్లడించాడు. కౌంటీ క్రికెట్ జట్టు కెంట్‌ తరఫున సమ్మర్‌లో ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. సుదీర్ఘ ఫార్మాట్‌పై దృష్టి పెడుతున్నట్లు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బిల్లింగ్స్‌ పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 2023లో తాను పాల్గొనబోనని కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అని సామ్ బిల్లింగ్స్ సోమవారం ట్వీట్‌లో పేర్కొన్నాడు. 'ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్‌ 2023 నుంచి వైదొలిగాను. ఇంగ్లీష్ వేసవి ప్రారంభంలో కెంట్‌ తరఫున ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని చూస్తున్నా' అని బిల్లింగ్స్ పేర్కొన్నాడు. బిల్లింగ్స్‌ను 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2 కోట్లకు కొనుగోలుచేసింది. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన బిల్లింగ్స్‌.. 122.46 స్ట్రయిక్‌ రేట్‌తో 24.14 సగటున 169 పరుగులు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై చేసిన 36 రన్స్ అత్యధికం.



ఐపీఎల్‌ 2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 14 గేమ్‌లలో కేవలం ఆరు విజయాలను మాత్రమే అందుకుంది. దాంతో పది జట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2023 ట్రేడింగ్‌లో భాగంగా రహ్మానుల్లా గుర్భాజ్‌, లోకీ ఫెర్గూసన్‌లను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి.. శార్దూల్‌ ఠాకూర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి ట్రేడ్ చేసింది. ఇక సామ్‌ బిల్లింగ్స్‌ స్థానాన్ని వికెట్‌ కీపర్‌ రహ్మానుల్లా గుర్భాజ్‌ భర్తీ చేయనున్నాడు. ఐపీఎల్ జట్లు తమ రిటెన్షన్‌ల జాబితాను ప్రకటించడానికి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. 2023 సీజన్‌కు ముందు వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది.


Also Read: ఫేస్‌బుక్‌‌లో లవ్‌.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన భారత క్రికెటర్! ఆసక్తికరమైన ప్రేమ కథ


Also Read: Samantha Naga Chaitanya : ఆ విషయంలో సమంత ముందు నిలబడని నాగ చైతన్య.. ఇది మామూలు రేంజ్ కాదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి