Sanju Samson Love Story: ఫేస్‌బుక్‌‌లో లవ్‌.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన భారత క్రికెటర్! ఆసక్తికరమైన ప్రేమ కథ

Sanju Samson Love Story with his Wife Charulatha. చారులత పారిశ్రామికవేత్త, సంజు శాంసన్ క్రికెటర్ కదా.. వీరిద్దరు ఎలా కలిశారు?, వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందని అనుకుంటున్నారా?.    

Written by - P Sampath Kumar | Last Updated : Nov 14, 2022, 04:53 PM IST
  • ఫేస్‌బుక్‌‌లో లవ్‌
  • పెద్దలను ఒప్పించి పెళ్లాడిన భారత క్రికెటర్
  • ఆసక్తికరమైన ప్రేమ కథ
Sanju Samson Love Story: ఫేస్‌బుక్‌‌లో లవ్‌.. పెద్దలను ఒప్పించి పెళ్లాడిన భారత క్రికెటర్! ఆసక్తికరమైన ప్రేమ కథ

Indian Cricketer Sanju Samson loves Charulatha on Facebook: భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్.. ఇలా చాలామంది క్రికెటర్లు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. ఇందులో కొంత మంది ప్లేయర్స్ హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. మరికొందరు తమను అభిమానించిన వాళ్లని మ్యారేజ్ చేసుకున్నారు. అయితే యువ ఆటగాడు సంజు శాంసన్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 

 సంజు శాంసన్ భార్య పేరు చారులత శాంసన్. 2018లో చారులతను సంజు పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కొందరు భారత అటగాళ్లు కూడా హాజరయ్యారు. అయితే చారులత వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త. చారులత పారిశ్రామికవేత్త, సంజు క్రికెటర్ కదా.. వీరిద్దరు ఎలా కలిశారు?, వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందని అనుకుంటున్నారా?.  సంజు,  చారులతకు ఆసక్తికరమైన ప్రేమ కథ ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. 

చారులత, సంజు శాంసన్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. తిరువనంతపురంలోని ఇవానియోస్ కాలేజీలో చారులత సైన్స్ విద్యార్థిని. అదే కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో సంజు బీఏ చేశాడు.ఫేస్‌బుక్ ద్వారా చారులత, సంజు పరిచయమయ్యారు. ముందుగా చారులతకు సంజు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగా.. ఆమె యాక్సప్ట్ చేశారు. ఫేస్‌బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఐదేళ్ల పాటు లవ్ చేసుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి ఒక్కటయ్యారు. ఇద్దరి వివాహం 22 డిసెంబర్ 2018న జరిగింది.

ఇక్కడ విషయం ఏంటంటే.. సంజు శాంసన్‌ది క్రిస్టియన్ కుటుంబం కాగా.. చారులతది హిందూ కుటుంబం. అయినా కూడా వీరిద్దరి ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. చారులత చాలా సింపుల్. తన వ్యాపారం చూసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. అందుకే ఇతర క్రికెటర్ల భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్స్ మాదిరి ఫేమస్ కాలేదు. 28 ఏళ్ల సంజు శాంసన్ భారత్ తరఫున 10 వన్డేలు, 16 టీ20లు ఆడాడు. ఇక 138 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు కెప్టెన్‌గా ఉన్నాడు. 

Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2022.. తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!

Also Read: ICC Team: ఐసీసీ అత్యుత్తమ టీమ్.. భారత్ నుంచి ఇద్దరి చోటు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x