IPL 2023: భారత ఆటగాళ్లను ఇతర లీగ్‌లలో ఆడనివ్వం.. కారణం చెప్పిన ఐపీఎల్ ఛైర్మన్!
Arun Dhumal on Indian players participation in overseas leagues. భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మరోసారి స్పష్టం చేశారు.
IPL New Chairman Arun Dhumal says Indian players not played overseas Cricket leagues: ప్రపంచ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ లీగ్‌లో భాగం కావాలని ఇతర దేశాల స్టార్ క్రికెటర్స్ కూడా ఆశిస్తారు. ఐపీఎల్ సమయంలో దేశానికి ప్రాతినిథ్యం వహించడానికి కూడా మక్కువ చూపరు అంటే.. ఇట్టే ఆర్షం చేసుకోవచ్చు. అయితే 2008లో ఐపీఎల్ ఆరంభం అయినప్పటినుంచి ఇతర దేశాల ప్లేయర్స్ భారత టీ20 లీగ్‌లో ఆడుతున్నారు కానీ.. ఇండియన్ ప్లేయర్స్ మాత్రం ఇతర లీగ్‌లలో ఆడడం లేదు. ఇతర లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐని పలువురు కోరినా ఫలితం లేదు.
ఎప్పటిలానే భారత క్రికెటర్లకు బయట లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వమని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మరోసారి స్పష్టం చేశారు. 'ఐపీఎల్‌ను ప్రస్తుతం ఉన్నదాని కంటే మరింత ఆకర్షణీయంగా మారుస్తాం. త్వరలోనే ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్‌గా అవతరిస్తుంది. అభిమానులకు మరింత చేరువకావడానికి భారత టోర్నీని వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మైదానంలో చూసినా లేదా టీవీలో చూసినా అందరికి నాణ్యమైన అనుభవం ఇవ్వాలన్నది మా ప్రయత్నం' అని ఐపీఎల్ ఛైర్మన్ చెప్పారు.
'ఐపీఎల్ షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తే.. అభిమానులు కూడా మ్యాచ్‌లకు తగ్గట్టుగా సిద్ధమవుతారు. ఐపీఎల్‌లో జట్ల సంఖ్య 10కి మించి ఉండదు. ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. ఒకవేళ పెంచితే టోర్నీ నిర్వాహణ చాలా కష్టం అవుతుంది. తొలి రెండు సీజన్లలో 74 మ్యాచ్‌లు నిర్హహించాం. ఆ తర్వాత 84.. ఇప్పుడు 94 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నాం. టోర్నీ సుదీర్ఘంగా సాగుతోంది. అయితే ఫుట్‌బాల్ లీగ్‌లతో మేం పోల్చుకోం. ఎందుకంటే క్రికెట్ చాలా భిన్నం' అని అరుణ్ ధూమల్ చెప్పారు.
'భారత ఆటగాళ్లను ఇతర లీగ్‌లలో ఆడనివ్వం. ప్లేయర్స్ ఫిట్‌నెస్, తీరికలేని అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని బయట లీగ్‌లు ఆడించకూడదని మొదటి నుంచి బీసీసీఐ భావించింది. ఎప్పటికీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మహిళల ఐపీఎల్ టోర్నీని పురుషుల ఐపీఎల్‌కు తీసిపోని విధంగా మారుస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళా అభిమానులు ప్రత్యేకంగా చుస్తునారు. ఐపీఎల్ నుంచి స్ఫూర్తి పొంది మహిళలు క్రికెట్‌లోకి వస్తారు. పురుషులతో సమానంగా మహిళలకు మ్యాచ్‌లు ఫీజులు పెంచడానికి ఇది ఓ కారణం' అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ చెప్పుకొచ్చారు.
Also Read: Sania-Shoaib Divorce: సానియా, షోయబ్‌ల విడాకులు.. వెలుగులోకి అసలు కారణం! వివాహేతర సంబంధమే
Also Read: Earthquake Causes: భూకంపాలు ఎలా ఏర్పడతాయో తెలుసా..? అసలు కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి