SRH Retained Players List: కేన్ మామకు భారీ షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎస్‌ఆర్‌హెచ్ రిటైన్ జాబితా ఇదే!
SRH release Kane Williamson and Nicholas Pooran ahead of IPL 2023 Auction. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
Full List Of Retained And Released Players by Sunrisers Hyderabad: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) భారీ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కేన్ మామను రిటైన్ చేసుకోకుండా వేలంలో విడిచిపెట్టింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్‌ను కూడా ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసింది. రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించే మంగళవారం (నవంబర్ 15) సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఎస్‌ఆర్‌హెచ్ తమ జాబితాను ప్రకటించింది. ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబర్ 23న కోచి వేదికగా జరగనుంది.
ఐపీఎల్ 2022 వేలంలో కేన్ విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.14 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో కేన్ మామ తన స్దాయికి తగ్గట్టు రాణించలేదు. 13 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్.. 216 పరుగులు మాత్రమే చేశాడు. అటు కెప్టెన్సీ పరంగా కూడా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. రూ.10.75 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్‌తో కూడా ఆకట్టుకోలేదు. రొమారియో షెఫార్డ్‌ను కూడా ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసింది. షెఫార్డ్‌ను రూ.7.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ లాంటి స్టార్ ఆటగాళ్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకుంది. ఐపీఎల్ 2023 మినీ వేలంకు ముందు ఎస్‌ఆర్‌హెచ్ పర్స్‌లో రూ. 42.25 కోట్లు ఉన్నాయి.ఈ మొత్తంతో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ రిటెన్షన్ లిస్ట్:
ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, వాషింగ్టన్ సుందర్, కార్తీక్ త్యాగీ, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్లక్ ఫరూఖీ.
సన్‌రైజర్స్ రిలీజ్ లిస్ట్:
కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.
Also Read: Gold Price Today 16 November: మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! పెరిగిన వెండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook