IPL 2024 Auction: ఐపీఎల్ 2024 కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలు విడుదల చేసేశాయి. అటు వేలానికి సిద్ధమైన ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక మిగిలింది వేలం మాత్రమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 వేలంలో కీలకమైన రెండు ప్రక్రియలు ముగిశాయి. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే రిటెన్షన్ అండ్ రిలీజ్ లిస్ట్ విడుదల చేశాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరంగా దాదాపు అన్ని జట్లు పెద్ద సంఖ్యలో కీలక ఆటగాళ్లను వదులుకున్నాయి. కొత్త ఆటగాళ్లపై కన్నేశాయి. ముఖ్యంగా ప్రపంచకప్ 2023 హీరోలపై దృష్టి సారించాయి. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలానికి సంబంధించి మరో ప్రక్రియ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ముగిసింది. ఇక మిగిలింది వేలం మాత్రమే. 


ఐపీఎల్ 2024 వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం పది జట్లకు కావల్సింది 77 మంది ఆటగాళ్లే. అంటే 77 మంది కోసం 1166 మంది పోటీ పడనున్నారు. వీరిలో 25 మంది ఆటగాళ్లు 2 కోట్ల బేస్ ప్రైస్ కేటగరీలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే వివిధ జట్లు రిలీజ్ చేసిన ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లతో పాటు శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్, హర్షల్ పటేల్ ఉన్నారు. 


2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఆటగాళ్ల జాబితా


హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేదార్ జాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సీన్ అబాట్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, ముస్తఫీజుర్ రెహమాన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్టన్, హ్యారీ బ్రూక్ ఓవర్టన్, ఆదిల్ రషీద్, డేవిస్ విల్లీ, క్రస్ వోక్స్, లాకీ ఫెర్గూసన్, గెరాల్డ్ కోయెట్జీ, రిలీ రోసోవ్, రాస్సీ వాన్‌డెర్ డుసెన్, ఏంజెలో మాధ్యూస్ ఉన్నారు. ఈసారి ఐపీఎల్ వేలంలో ట్రేవిస్ హెడ్, రచిన్ రవీంద్ర, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కోయెట్జీలకు మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది. కచ్చితంగా భారీ ధర పలకవచ్చని అంచనా.


Also read: IND vs AUS 4th T20 Highlights: టీమిండియాదే సిరీస్.. నాలుగో టీ20లో థ్రిల్లింగ్ విక్టరీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook