IPL 2024 Closing Ceremony: ఐపీఎల్ 2024 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఐపీఎల్ 2024 టైటిల్ కోసం కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ జట్లు చెన్నై చెపాక్ స్డేడియంలో తలపడనున్నాయి. ఫైనల్ కావడంతో కళ్లు చెదిరే ఈవెంట్లతో క్లోజింగ్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 ముగింపు సందర్భంగా ప్రపంచ విఖ్యాత అమెరికన్ రాక్ బ్రాండ్ ఇమేజిన్ డ్రాగన్స్ అద్భుతమైన లైవ్ ప్రదర్శన ఇవ్వనుంది. ఇన్ స్టాగ్రామ్ ఎక్కౌంట్ ద్వారా ఇమేజిన్ డ్రాగన్స్ స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేసింది. ఇమేజిన్ డ్రాగన్స్ టీమ్ లీడ్ సింగర్ డేన్ రేనాల్డ్స్ కూడా స్పార్ స్పోర్ట్స్ మాధ్యమంగా కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ 17 ముగింపు వేడుకల్లో తాను పాల్గొంటున్నానని పోస్ట్ చేశాడు. ఐపీఎల్ 2024 క్లోజింగ సెరెమనీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. 


ఐపీఎల్ 2024 సీజన్ 17 ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్ హాజరుకాగా ముగింపు వేడుకలకు ఇమేజిన్ డ్రాగన్స్ ప్రముఖ సింగర్ డేన్ రేనాల్డ్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఐపీఎల్ 2024 ముగింపు వేడుకలు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో, జియో సినిమాలో లైవ్ టెలీకాస్ట్ కానున్నాయి. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుండగా, అంతకంటే ముందు 6 గంటల్నించి దాదాపు గంటన్నరసేపు ముగింపు వేడుకలు, లేజర్ షో వంటివి అలరించనున్నాయి. 


Also read: IPL 2024 KKR vs SRH Final: వర్షంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి, విజేత ఎవరు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook