IPL DC vs LSG: దుమ్మురేపిన పంత్ సేన.. విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పైకి.. లక్నో ఇంటికి
IPL 2024 DC vs LSG Delhi Capitals Super Win Lucknow Out Playoff: ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ పోరు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కీలకమైన మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జియాంట్స్‌ను చిత్తు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
IPL 2024 DC vs LSG Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. లీగ్ మ్యాచ్‌లు ముగుస్తున్నా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్లు తేలడం లేదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతం చేసి లక్నో చేతిలో నుంచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన ఢిల్లీ గొప్పగా పుంజుకుని విజృంభించింది. ఫలితంగా లక్నో సూపర్ జియాంట్స్‌ను 0000 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుని ఇంటికి వెళ్లిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్ గోల్డెన్ డకౌట్ కావడంతో ఢిల్లీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అనంతరం బరిలోకి దిగిన అభిషేక్ పరేల్ (58) అర్థ శతకంతో మెరిశాడు. త్రిస్టన్ స్టబ్స్ (57) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. శాయ్ హోప్ (38) దూకుడు ఆడగా.. నిషేధం తర్వాత తిరిగి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ (33) పరవాలేదనిపించాడు. అక్షర్ పటేల్ (14) పరుగుల చేశాడు.
Also Read: IPL RCB vs DC: ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ పని ఖతం
కీలకమైన మ్యాచ్‌ను తప్పక గెలవాల్సి ఉండగా లక్నో సూపర్ కింగ్స్ విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో సహా అందరూ బ్యాటర్లు చేతులెత్తేశారు. క్వింటాన్ డికాక్ (12), కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినిస్ (5), ఆయూశ్‌బదౌనీ (6), కృనాల్ పాండ్యా (18), రవి బిష్ణోయ్ (2) అతి తక్కువ పరుగులతో తీవ్ర నిరాశ మిగిల్చారు. దీపక్ హుడా డకౌట్ కాగా.. నికోలస్ పూరన్ గొప్పగా ఆడాడు. 27 బంతుల్లో 61 పరుగులు చేసి పూరన్ సత్తా చాటాడు.
జట్టు ఆశలు కోల్పోయిన సమయంలో అర్షద్ ఖాన్ అద్భుతం చేశాడు. వికెట్లు పడుతున్న సమయంలో మైదానంలో ఉండి గొప్ప పోరాటం చేశాడు. 33 బంతుల్లో 58 పరుగులు చేసి అర్షద్ లక్నోను గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. కానీ అతడి శ్రమ వృథా అయ్యింది. ప్రత్యర్థి జట్టు మాదిరే ఢిల్లీ కూడా ఎక్కువ మందితో బౌలింగ్ వేయించింది. ఏకంగా 8 మందితో పంత్ బౌలింగ్ వేయించాడు. ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, త్రిస్టన్ స్టబ్స్ ఒక్కో వికెట్ తీసి జట్టు విజయంలో భాగమయ్యారు.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter