Sunrisers Hyderabad Downfall: కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కసి మీద ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌లో మాత్రం ఘోరంగా విఫలమైంది. చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ బౌలింగ్‌కు సన్‌రైజర్స్‌ కుప్పకూలింది. టాపార్డర్‌ మొదలుకుని ఆఖరి ఆటగాడి వరకు ఎవరూ గొప్పగా ప్రదర్శన చేయలేదు. ఫలితంగా కేవలం 113 పరుగులు మాత్రమే చేసి 18.3 బంతులకే ఆలౌటైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL 2024 KKR vs SRH Live: ట్రావిస్ హెడ్‌ 'రాత' మారలేదు.. ఈ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్లు


పవర్‌ ప్లేలోనే పతనం
టాస్‌ నెగ్గి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ట్రోఫీ కోసం జరుగుతున్న పోరులో భారీ పరుగులు సాధించాలనే పట్టుదలతో ఉన్న సన్‌రైజర్స్‌ బ్యాటర్లను కోల్‌కత్తా నైట్‌ రైడర్‌ బౌలర్లు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా 18.3 ఓవర్‌లలో 113 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ చాప చుట్టేసింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా పాతిక పరుగులు కూడా చేయలేకపోయారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో పాట్‌ కమిన్స్‌ రంగంలోకి దిగి పరుగుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతి ఎక్కువ పరుగులు ఇవే కావడం గమనార్హం.

ట్రావిస్‌ హెడ్‌ గోల్డెన్‌ డకౌట్‌తో మొదలైన పతనం ఉనద్కట్‌ వరకు కొనసాగి జట్టు కుప్పకూలింది. అభిషేక్‌ శర్మ (2), రాహుల్‌ త్రిపాఠి (9), ఐడెన్‌ మర్‌క్రమ్‌ (20), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13), హెన్రిచ్‌ క్లాసెన్‌ (16), షాబాద్‌ అహ్మద్‌ (8), అబ్దుల్‌ సమద్‌ (8), ఉనద్కట్‌ (4) పరుగులు చేసి జట్టును ప్రమాదంలోకి నెట్టారు. కప్‌ అవకాశాలను బ్యాటర్లు సంక్లిష్టం చేశారు.


Also Read: SRH vs RR Highlights: ఫైనల్లోకి సన్‌రైజర్స్‌.. కావ్య మారన్‌ సంబరాలు మామూలుగా లేవు


అద్భుత బౌలింగ్ 
క్వాలిఫయర్‌ 1లో సన్‌రైజర్స్‌ను అతి తక్కువ పరుగులకే పరిమితం చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ బౌలర్లు ఐపీఎల్‌ ఫైనల్‌లో అంతకుమించి ప్రదర్శన చేశారు. ఏ ఒక్క బ్యాటర్‌ను కూడా మైదానంలో ఎక్కువ సేపు నిలపలేదు. హెడ్‌ను డకౌట్‌తో మొదలుకుని ఆఖరి బ్యాటర్‌ ఉనద్కట్‌ వరకు అందరినీ వరుసగా పెవిలియన్‌ పంపించారు. బౌలర్ల దెబ్బకు సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లోనే అత్యల్ప పరుగులు చేయడం గమనార్హం. బౌలింగ్‌ వేసిన ప్రతి బౌలర్‌ వికెట్‌ తీయడం విశేషం.

ఆండ్రె రస్సెల్‌ 2.3 ఓవర్లు మాత్రమే వేసి ౩ వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను చావుదెబ్బ తీశాడు. పవర్‌ ప్లేను మిచెల్‌ స్టార్క్‌ ప్రమాదకరంగా మార్చాడు. ఒక్క బ్యాటర్‌ కూడా పవర్‌ ప్లేను సద్వినియోగం చేసుకోనివ్వలేదు. 3 ఓవర్లు వేసిన స్టార్క్‌ 2 కీలక వికెట్లు తీసి పవర్‌ ప్లేలోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నడ్డి విరిచాడు. అతడి స్ఫూర్తితో మిగతా బౌలర్లు రెచ్చిపోయారు. బర్త్‌ డే బాయ్‌ హర్షిత్‌ రాణా కూడా 2 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. మిగతా వైభవ్‌ అరోరా, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ఒక్కో వికెట్‌ తీసి హైదరాబాద్‌ను ముప్పుతిప్పలు పెట్టారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter