MI vs DC Match: సమిష్టిగా రాణించిన హార్దిక్ సేన.. ఎట్టకేలకు ముంబైను వరించిన విజయం..
MI vs DC Live: ఎట్టకేలకు ముంబై ఘన విజయం సాధించింది. హోం గ్రౌండ్ లో ఢిల్లీపై 29 పరుగుల తేడాతో హార్దిక్ సేన గెలుపొందింది. మ్యాచ్ పూర్తి వివరాలు మీ కోసం.
IPL 2024, MI vs DC Match Highlights: ఇన్నాళ్లకు ముంబై బ్యాటర్లు జూలు విదిల్చారు. హోం గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోశారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(44), టిమ్ డేవిడ్(45 నాటౌట్), రొమారియో షెపర్డ్(39 నాటౌట్) బ్యాట్ ఝలిపించడంతో హార్దిక్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, అన్రిచ్ నోకియాలు చెరో రెండు వికెట్లు తీశారు.
చెలరేగిన ముంబై బ్యాటర్లు
టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంటో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబైకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ మెరుపు ఆరంభినిచ్చారు. హిట్ మ్యాన్, ఇషాన్ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్ లోకి పంపారు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న రోహిత్(49) ను అక్షర పటేల్ ఔట్ చేశాడు. వెనువెంటనే ఇషాన్(42) కూడా అక్షర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ కూడా ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. మరోవైపు హార్ధిక్(39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టిమ్ డేవిడ్ తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని నోర్టిస్ విడదీశాడు. హార్దిక్ ను ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. చివర్లో డేవిడ్(45), షెపర్డ్(39) ఢిల్లీ బౌలర్లను పిచ్చకొట్టుడు కోట్టారు. చివరి 13 బంతుల్లోనే 53 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు ఈజీగా 200 మార్కును క్రాస్ చేసింది.
హాఫ్ సెంచరీలు చేసిన పృథ్వీ షా, స్టబ్స్.. దెబ్బకొట్టిన కోయిట్జ్
లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో రాణించాడు. వార్నర్ పది పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ పొరెల్, స్టబ్స్ ధాటిగా ఆడి స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. ఈ క్రమంలో స్టబ్స్ అర్థ శతకం సాధించాడు. చివరి వరకు స్టబ్స్ క్రీజులో నిలిచినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ ఓడిపోక తప్పలేదు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జ్ నాలుగు వికెట్లు తీశాడు.
Also read: IPL 2024 Points Table: లెక్కేసి కొడుతున్న రాజస్థాన్... దెబ్బకు దిగజారిన KKR స్థానం..
Also Read: RR vs RCB Highlights: సిక్స్ తో బట్లర్ సెంచరీ...ఆర్సీబీపై రాజస్థాన్ సూపర్ విక్టరీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook