IPL 2024 PBKS vs GT: ఐపీఎల్ 2024 వేలంలో అద్భుతాలు జరిగాయి. కొందరు దిగ్గజ ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకుండా వదిలేస్తే మరి కొందరిని రికార్డు ధరకు దక్కించుకున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇంకొందరిని పొరపాటున కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఆ పొరపాటే ఊహించని విజయాన్ని అందిస్తే ఇక ఆ జట్టుకు అంతకంటే ఆనందం ఉంటుందా..అదే జరిగింది.
ఐపీఎల్ 2024 సీజన్ 17లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ మ్యాచ్ మొత్తం ఫలితమే ఎవరూ ఊహించనివిధంగా వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 199 పరుగులు చేసి 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ 89 పరుగులతో ప్రత్యర్ది ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. ఇక విజయం గుజరాత్ టైటాన్స్ జట్టుదే అనుకున్నారు. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 73 పరుగులకకే 4 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్ లెవెన్. శిఖర్ ధావన్, బెయిర్ స్టో వంటి కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో ఇక పంజాబ్ ఓటమి తధ్యమనుకున్నారు. కానీ ఆ సమయంలో క్రీజ్ లో వచ్చిన శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. కేవలం 29 బంతుల్లో 61 పరుగులు సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో బంతి మిగిలుండగానే 207 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది పంజాబ్ కింగ్స్ లెవెన్.
పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన శశాంక్ సింగ్ జట్టులో ప్రవేశమే విచిత్రంగా జరిగింది. ఐపీఎల్ 2022 తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇతడిని వదిలిపెట్టగా ఐపీఎల్ 2023 వేలంలో ఎవరూ తీసుకోలేదు. అయితే ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ లెవెన్ 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. కానీ వేలంలో శశాంక్ సింగ్ పేరుతో ఇద్దరుండటంతో పంజాబ్ కింగ్స్ లెవెల్ పొరపాటున ఇతడిని కొనుగోలు చేసింది. తరువాత వెనక్కి పంపుదామని చూసినా నిబంధనలు అడ్డరావడంతో ఊరుకుంది. ఇప్పుడు పొరపాటున జట్టులో ఇన్ అయిన ఆ ఆటగాడే విజయాన్ని అందించడంతో పంజాబ్ కింగ్స్ లెవెన్ ఆనందానికి హద్దులేకుండా పోయింది.
Also read: GT vs PBKS Highlights: శుభ్‌మన్ గిల్ కుమ్మినా గుజరాత్‌కు తప్పని ఓటమి.. శశాంక్ మాయతో పంజాబ్ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook